భగ్గుమన్న రాజంపేట ఖిల్లా..

ABN , First Publish Date - 2022-01-27T05:42:56+05:30 IST

రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై అన్నమయ్య ప్రాంతీయులైన రాజంపేట నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులను అవమానించేరీతిలో ఆయన జన్మించిన గడ్డను జిల్లా కేంద్రం చేయకుండా ఎక్కడో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం ఏమిటని పేర్కొంటూ అన్ని పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

భగ్గుమన్న రాజంపేట ఖిల్లా..
అన్నమయ్య విగ్రహం ఎదుట టీడీపీ నాయకుల నిరసన

అన్నమయ్య విగ్రహం ఎదుట టీడీపీ నేతల భారీ నిరసన ప్రదర్శన, ర్యాలీ 

జిల్లా కేంద్రంగా రాయచోటి ప్రకటనపై ప్రజల ఆగ్రహం

రాజంపేట, జనవరి 26: రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై అన్నమయ్య ప్రాంతీయులైన రాజంపేట నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులను అవమానించేరీతిలో ఆయన జన్మించిన గడ్డను జిల్లా కేంద్రం చేయకుండా ఎక్కడో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం ఏమిటని పేర్కొంటూ అన్ని పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇనచార్జి పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు రాజంపేట అన్నమయ్య విగ్రహం వరకు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీ నిర్వహించి విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ మిథునరెడ్డి, ప్రభుత్వ విప్‌ శ్రీకాంతరెడ్డి, ప్రభుత్వ సలహాదారులైన ఓ ఐఏఎస్‌ అధికారి రాయచోటిలో భారీ ఎత్తున ముందస్తుగానే తక్కువ రేట్లతో వందలాది ఎకరాల్లో భూములను కొనుగోలు చేసి వాటి ద్వారా వేల కోట్లు సంపాదించాలన్న ఉద్దేశ్యంతోనే రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించుకున్నారని ఆరోపించారు. చారిత్రాత్మక నేపధ్యం, వసతులు ఉన్న రాజంపేట ప్రాంతాన్ని కాకుండా రాయచోటి ప్రాంతాన్ని ఎలా జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని నిలదీశారు. రాజంపేట ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మనలు వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేసి రాజంపేట జిల్లా కేంద్రంపై పోరాటం చేస్తే వారికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతామని ప్రకటించారు. లేదంటే తామే ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్‌, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి అద్దేపల్లె ప్రతా్‌పరాజు, ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మందా శ్రీను, కుమార్‌, కోవూరు సుబ్రహ్మణ్యంనాయుడు, సంజీవరావు, తుపాకుల అశోక్‌, అబుబకర్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


తాళ్లపాకలో నిరసన ప్రదర్శన

తమ గ్రామ నివాసి అన్నమయ్య పేరుతో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారంటూ అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక గ్రామస్థులు బుధవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. ఆ గ్రామ వైసీపీ నాయకుడు, మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన యోగీశ్వర్‌రెడ్డి, వైసీపీకి చెందిన తాళ్లపాక సర్పంచ గౌరీశంకర్‌, ఎంపీటీసీ మధుసూధనవర్మ, ఆ గ్రామ నాయకులు అంజనరాజు, సాంబశివరాజు, మాజీ ఎంపీటీసీ శేఖర్‌రాజు, రాజంపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ కూండ్ల రమణారెడ్డి, బీసీ నాయకులు రాము యాదవ్‌, శివ తదితరులు నిరసన వ్యక్తం చేశారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోతే తాళ్లపాక వాసులమంతా మూకుమ్మడిగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. 


కాంగ్రె్‌స, వామపక్ష నేతలు ఆందోళనకు శ్రీకారం

రాజంపేటలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ, వామపక్ష నేతలు అత్యవసర సమావేశం నిర్వహించి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోతే ఈ ప్రాంతం నుంచి ఎంపికైన ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేస్తూ ఆందోళనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఇనచార్జి పూలభాస్కర్‌, సీపీఐ కార్యదర్శి మహేష్‌, సీపీఎం కార్యదర్శి రవికుమార్‌, డీవైఎ్‌ఫఐ నాయకులు నరసింహ, పీడీఎ్‌సఐ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


వైసీపీ ప్రధాన నేతల చేతగానితనం వల్లే : బీజేపీ 

రాజంపేట వైసీపీ ప్రధాన నేతల చేతగానితనం వల్లే రాజంపేటకు ఈ దుస్థితి దాపురించిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు విమర్శించారు. రాజంపేటను జిల్లా చేయకపోతే స్థానిక నేతలను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 



Updated Date - 2022-01-27T05:42:56+05:30 IST