భగత్‌సింగ్‌ త్యాగాలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2022-09-29T04:25:23+05:30 IST

భగత్‌సింగ్‌ త్యాగాలు చిరస్మరణీయమని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి సన్నిగౌడ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, కలేందర్‌ఖాన్‌ అన్నారు.

భగత్‌సింగ్‌ త్యాగాలు చిరస్మరణీయం
రక్తదానం నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

- ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి సన్నిగౌడ్‌  

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు  28: భగత్‌సింగ్‌ త్యాగాలు చిరస్మరణీయమని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి సన్నిగౌడ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, కలేందర్‌ఖాన్‌ అన్నారు.  బుధవారం భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం నిర్వహించారు. కార్యక్రమంలో బ్లడ్‌బ్యాంకు ఇంచార్జి మధుసూదన్‌రెడ్డి, నాయకులు కుతుబ్‌, ఎనగందుల నర్సయ్య, చిప్ప నర్సయ్య, మేకల దాసు,  దేవి పోచన్న, ప్రేంసింగ్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.  

ఏసీసీ: భగత్‌సింగ్‌ జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాలలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీలత, వైష్ణవి, భార్గవి, జ్యోతి, కార్తిక్‌, శివ, అజయ్‌, మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.  

మందమర్రి: పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ 1 చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్‌, నాయకులు వనం సత్యనారాయణ, మిట్టపెల్లి పౌల్‌, పెండ్యాల కమలమ్మ, కాదండి సాంబయ్య, మెరుగు రాజేశం, ఎగుడు మొండి, రాంపెళ్లి రాజం, ఎరవేని రవిందర్‌, చొప్పదండి దుర్గ, మోతె రాజలింగు, మిట్టపెల్లి క్లిస్టాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

చెన్నూరు: పట్టణంలోని అఖిల భారత యువత సమాఖ్య నాయకులు భగత్‌సింగ్‌ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి సమ్మయ్య, నాయకులు రాజయ్య, కిష్ఠయ్య, శంకర్‌, సంజయ్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-29T04:25:23+05:30 IST