పద్యాల్లో గీతాసారం

ABN , First Publish Date - 2021-04-30T05:30:00+05:30 IST

‘‘దేశమాత ఎలాంటిదో గీతామాత అలాంటిదే!’’ అంటారు ఆచార్య మనస చెన్నప్ప. భగవద్గీతను సకల ధర్మసారంగా పండితులు ప్రస్తుతించారు. జీవన మార్గదర్శిగా ఎందరో అభివర్ణించారు...

పద్యాల్లో గీతాసారం

‘‘దేశమాత ఎలాంటిదో గీతామాత అలాంటిదే!’’ అంటారు ఆచార్య మనస చెన్నప్ప. భగవద్గీతను సకల ధర్మసారంగా పండితులు ప్రస్తుతించారు. జీవన మార్గదర్శిగా ఎందరో అభివర్ణించారు. ఆచార్య చెన్నప్పకు గీత ఒక మాతృ మూర్తిగా దర్శనమిచ్చింది. అందుకే తన శతకానికి ‘మాతృ గీత’ అని పేరు పెట్టారు. ‘మనసువెట్టి చదువు మాతృ గీత’ అనే మకుటంతో సాగే నూట రెండు పద్యాలివి. భగవద్గీతలోని శ్లోకాలకు తెలుగులో పద్యరూప వ్యాఖ్యానాలుగా వీటిని చెప్పుకోవచ్చు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన ఆచార్య చెన్నప్ప సాహిత్య, భాషా పరిశోధనలోనూ, పద్య కవితా రచనలోనూ నిష్ణాతులు. ఆధ్యాత్మిక, వేదాంతపరమైన విషయాలనూ, వివేకాన్ని ప్రేరేపించే అంశాలనూ ‘మాతృ గీత’లో సరళమైన భాషలో వివరించడంలో ఆయన అనుభవం, నైపుణ్యం కనిపిస్తుంది.


మాతృ గీత

ఆచార్య మసన చెన్నప్ప

ప్రచురణ: పాలమూరు సాహితి, మహబూబ్‌నగర్‌

పేజీలు: 38, వెల: రూ. 40

ప్రతులకు: 9885654381, 9032844017


Updated Date - 2021-04-30T05:30:00+05:30 IST