ఓ భక్తుడి జీవితంలో జరిగిన యథార్థ కథ ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ‘భద్రకాళి’ చిత్రంలోని ఏడు పాటలతో వీగా ఆడియో కంపెనీ రూపొందించిన సీడీని సీనియర్ నటి సీత విజయదశమి రోజున విడుదల చేశారు. సీత, సంధ్య, మనీశ్, తాగుబోతు రమేశ్, ధన్రాజ్, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను, జయవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత చిక్కవరపు రాంబాబు, దర్శకత్వం: కె.ఎం.ఆనంద్.