భద్రాద్రిలో సహస్ర కలశాభిషేకాలకు నేడు అంకురార్పణ

ABN , First Publish Date - 2021-02-25T04:52:30+05:30 IST

భద్రాద్రిలో సహస్ర కలశాభిషేకాలకు నేడు అంకురార్పణ

భద్రాద్రిలో సహస్ర కలశాభిషేకాలకు నేడు అంకురార్పణ
అంబాసత్రంలో కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం

రెండు రోజుల పాటు నిత్యకల్యాణాల నిలిపివేత 

భద్రాచలం, ఫిబ్రవరి 24: ప్రతి ఏటా మాఘమాసంలో భద్రాద్రి రామయ్యకు సహస్రకలశాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా గురువారం సాయంత్రం సహస్ర కలశాభిషేక మహోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. శుక్రవారం సహస్రకలశావాహనం, అగ్నిప్రతిష్ఠ, హవనం, మండప వాస్తు నిర్వహించనున్నారు. శనివారం రామయ్యకు సహస్రకలా భిషేకాన్ని నిర్వహించనుండగా.. ఈ మహోత్సవాల నేపథ్యంలో 26, 27 తేదీల్లో రామయ్యకు నిత్యకల్యాణాలను నిలిపివేయనున్నారు. 

మాఘ పునర్వసు వేళ ప్రత్యేక పూజలు

మాఘ పునర్వసు సందర్భంగా బుధవారం భక్తులు ప్రత్యేక పూజా కార్యక్ర మాలు నిర్వహించారు. సాయంత్రం తిరువీధి సేవ, చుట్టు సేవతో పాటు అంబాసత్రంలో సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం సంస్కృత పండితులు మాఘ పునర్వసు ప్రాశస్త్యాన్ని వివరించారు.  కార్యక్రమంలో అంబాసత్రం మేనేజర్‌ యామజాల మధుసూదన్‌, ఆధ్యాపకులు సుమంత్‌ శర్మ, కె.శివరామకృష్ణ శర్మ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T04:52:30+05:30 IST