భద్రాద్రి కొత్తగూడెం: ఆయన నికార్సయిన పోలీస్ ఆఫీసర్.. విధినిర్వహణలో పైరవీలకు లొంగరు.. పాత పాల్వంచ ఆత్మహత్య ఘటన కేసులో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా వనమా రాఘవను అరెస్టు చేసి సంచలనం సృష్టించారు. ఆయనే పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు. నేరస్తులను కటకటాల వెనుక నెట్టడంతోపాటు ఆయనలో మరో కోణం కూడా ఉంది. ఓ ఫంక్షన్లో రోహిత్ రాజు చేసిన డ్యాన్సు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా హీరోలకు తగ్గకుండా చేసిన డ్యాన్సు పలువురిని ఆకట్టుకుంది.