అజ్ఞాతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు

ABN , First Publish Date - 2022-01-04T17:52:43+05:30 IST

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

అజ్ఞాతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు

భధ్రాద్రి:  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు  వనమా రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వనమా రాఘవను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ,  కొత్తగూడెంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ ఆందోళనలు చేపట్టింది. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలలో అక్రమాలకు పాల్పడుతూ భూదందాలు సెటిల్ మెంట్‌లకు పాల్పడిన రాఘవ అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాఘవ పేరు చెబితేనే జనం భయపడిపోతున్నారని తెలిపారు. రాఘవను అరెస్టు చేయని పక్షంలో మరికొన్ని కుటుంబాలు బలవుతాయన్నారు. పోలీసులు ఇప్పటికైనా స్పందించాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు భట్టి విక్రమార్క,  కోనేరు చిన్ని, కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. 


భద్రాద్రి జిల్లా పాతపాల్వంచలో మండిగ నాగ రామకృష్ణ(38)అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుతుళ్లతో సహా ఒంటిపై పెట్రోల్ పోస్టుకు నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో అతనితో పాటు భార్య, ఓ కుమార్తె సజీవదహం అవగా, మరో కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.  ఆస్తి పంపకాల్లో ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవేంద్ర సెటిల్‌మెంట్‌ చేయడంతో వాటల్లో తనకు అన్యాయం జరిగిందంటూ నాగరామకృష్ణ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. 

Updated Date - 2022-01-04T17:52:43+05:30 IST