భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దొంగలు దొరికారు

ABN , First Publish Date - 2022-01-11T16:14:06+05:30 IST

ఎస్‌బీఐ శాఖలో రూ. 19లక్షల 35వేలు అపహరించిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దొంగలు దొరికారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దుమ్ముగూడెం, లక్ష్మీనగరంలోని ఎస్‌బీఐ శాఖలో రూ. 19లక్షల 35వేలు అపహరించిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో లక్ష్మీనగరం ఎస్‌బీఐ బ్యాంక్ వెనుక నుంచి కొందరు బ్యాంక్‌లోకి చొరబడి గ్యాస్ కట్టర్‌తో సేఫ్ లాకర్‌ను తెరిచినట్లు భద్రాచలం ఏఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి పక్కా సమాచారంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందినవారుగా గుర్తించారు. వారి నుంచి రూ. 3 లక్షల 10వేల నగదు, కారు, 9 సెల్ ఫోన్లు, చోరీకి ఉపయోగించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించిన సీఐ వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐ పుల్లయ్య, ఎస్ఐ రవికుమార్, ఏఎస్ఐ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ సురేష్, శంకర్, ఐటీకోర్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. పట్టుబడిన నిందితులు మూడేళ్ల నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు బ్యాంకులు, ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-01-11T16:14:06+05:30 IST