కొత్తగూడెం: వనమా కుటుంబం దౌర్జన్యాలకు నిరసనగా అఖిలపక్షం పిలుపుమేరకు కొత్తగూడెం, పాల్వంచలో శుక్రవారం బంద్ జరుగుతోంది. పలువురు ప్రజా సంఘాలు, పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెంలో వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు వనమా రాఘవ అరెస్టుపై హైడ్రామా చోటు చేసుకుంది. రాఘవను అరెస్టు చేయలేదని, ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే నిన్ననే రాఘవను అరెస్టు చేశారని, శుక్రవారం కొత్తగూడెం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి