Bhadradri Kottagudem జిల్లా: అశ్వారావుపేట పట్టణంలోని అంబేడ్కర్ నగర్ (దొంతికుంట)లో దాసరి శాంతి కుమారి(20) అనే యువతి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఆమె సూసైడ్ చేసుకుంది. వరుడికి అంగవైకల్యం ఉందని తెలిసి యువతి ఆత్మహత్యకి పాల్పడినట్లు సమాచారం. వివాహం ఆగితే కుటుంబం పరువుపోతుందని ఇంట్లో ఎవరూలేని సమయంలో శాంతి కుమారి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.