Abn logo
Jul 14 2021 @ 10:32AM

భద్రాద్రి కొత్తగూడెంలో విస్తారంగా వర్షాలు

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక, మండల అధికారులు హెచ్చరించారు. ప్రజలు వాగులు దాటకుండా పర్యవేక్షణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ములకలపల్లి మండలం, పూసుగూడెం గ్రామ శివారులో గల సీతారామ ప్రాజెక్ట్ కాలువ వంతెన వద్ద రోడ్డు కుంగిపోయింది. దీంతో భారీ వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అటు చర్ల తాలిపేరు ప్రోజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 16 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 11,248 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.