Abn logo
Jun 29 2021 @ 16:08PM

అన్నదమ్ముల మధ్య భూ వివాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చండుగొండ మండలం, రావికంపాడులో అన్నదమ్ముల మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. మాలోతు జీవన్,  మాలోతు రవి అనే ఇద్దరు అన్నదమ్ములు ఆరెకరాల భూమికి సంబంధించి గొడవకు దిగారు. అడ్డొచ్చిన తండ్రి మాలోతు బిక్షుపై పెద్ద కొడుకు జీవన్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బిక్షును పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భూమికి సంబంధించి అన్ని హక్కులు తమకే ఉన్నా.. అన్న, వదిన దౌర్జన్యం చేస్తున్నారని రవి ఆరోపించాడు.