భద్రాద్రి కలెక్టర్‌ పేరుతో ఫేక్‌ వాట్సాప్‌ ఖాతా

ABN , First Publish Date - 2022-04-26T17:49:01+05:30 IST

గుర్తుతెలియని వ్యక్తులు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ పేరుతో ఫేక్‌ వాట్సాప్‌ ఖాతాను తెరిచి. ప్రొఫైల్‌లో కలెక్టర్‌ ఫొటోను పెట్టిన సంఘటన సోమవారం వెలుగులోకి

భద్రాద్రి కలెక్టర్‌ పేరుతో ఫేక్‌ వాట్సాప్‌ ఖాతా

                   - కొత్తగూడెం వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో డీఆర్‌వో ఫిర్యాదు 


కొత్తగూడెం: గుర్తుతెలియని వ్యక్తులు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ పేరుతో ఫేక్‌ వాట్సాప్‌ ఖాతాను తెరిచి. ప్రొఫైల్‌లో కలెక్టర్‌ ఫొటోను పెట్టిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు స్వయంగా కలెక్టర్‌ పేరుతోనే  వాట్సాప్‌లో సందేశాలు పంపి.. డబ్బులు కావాలని డిమాండ్‌ చేయడం, హెచ్చరికలు చేయడం లాంటివి చేస్తుండటంతో.. అప్రమత్తమైన కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని నేరుగా కలెక్టరేట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆశ్చర్యానికి గురైన అధికారులు వెంటనే ఫేక్‌ వాట్సాప్‌ సమాచారాన్ని కలెక్టర్‌ అనుదీప్‌కు తెలపడంతో నివ్వెరపోయిన కలెక్టర్‌ సంబంధిత విషయాలను ఆరా తీశారు. ఇలాంటి నేరాగాళ్లను  వెంటనే గుర్తించాలని, సైబర్‌క్రైం, ఇంటిలిజెన్స్‌, పోలీసులను ఆదేశించారు. ఎవరైనా ఇలాంటి ఫోన్‌కాల్స్‌కు, వాట్సప్‌ సందేశాలకు తిరిగి స్పందించవద్దని తమ బ్యాంకు ఖాతా ఉన్న నగదు హ్యాక్‌ చేసే అవకాశాలున్నాయని ఇలాంటి నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రజలకు తెలిపారు. ఈ సంఘటనపై డీఆర్‌వో అశోక్‌చక్రవర్తి కొత్తగూడెం ఒకటో పోలీస్టేషన్‌లో కలెక్టర్‌ తరపున అధికారికంగా ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశామని కొత్తగూడెం ఒకటో టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2022-04-26T17:49:01+05:30 IST