Bhadrachalam: భద్రాచలం దగ్గర గోదావరి నది మహోగ్రరూపం

ABN , First Publish Date - 2022-07-14T21:49:02+05:30 IST

భద్రాచలం (Bhadrachalam) దగ్గర గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. 61.20 అడుగులకు వరద ఉధృతి చేరింది.

Bhadrachalam: భద్రాచలం దగ్గర గోదావరి నది మహోగ్రరూపం

భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) దగ్గర గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. 63.20 అడుగులకు వరద ఉధృతి చేరింది. భద్రాచలం దగ్గర గోదావరిలో 18,70,759 క్యూసెక్కుల ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు. రేపటికి 70 అడుగులు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భద్రాచలం నుంచి పలు మండలాలకు రాకపోకలు  నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి భారీగా వరద వస్తుండటంతో ఈ గండం గడిస్తే చాలు భగవంతుడా అంటూ గోదావరి పరివాహక ప్రాంత వాసులు వరద భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. గోదావరి తుదిప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి నెల్లిపాకవెళ్లే మార్గంలో పురుషోత్తపట్నం వద్ద వాహనాలను వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రహదారులపై వరద నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్తగా ఏపీ, తెలంగాణ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-07-14T21:49:02+05:30 IST