Shock to BGMI : బీజీఎంఐకి షాక్.. బ్యాన్ చేసిన గూగుల్, ఆపిల్ సంస్థలు

ABN , First Publish Date - 2022-07-29T17:54:41+05:30 IST

దేశంలో యువతను ఓ ఊపు ఊపేసి పబ్‌జీ గేమ్(PUBG Game).. ఆ స్థాయిలోనే విమర్శలను ఎదుర్కొంది.

Shock to BGMI : బీజీఎంఐకి షాక్.. బ్యాన్ చేసిన గూగుల్, ఆపిల్ సంస్థలు

Shock to BGMI : దేశంలో యువతను ఓ ఊపు ఊపేసి పబ్‌జీ గేమ్(PUBG Game).. ఆ స్థాయిలోనే విమర్శలను ఎదుర్కొంది. ఈ యాప్‌కు ఎడిక్ట్ అయిపోయి ఎంతో మంది యువత తమ ప్రాణాలు తీసుకున్నారు. పిల్లలు సైతం ఈ యాప్‌కు ఎడిక్ట్ అయి మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ పబ్‌జీ గేమ్‌ను బ్యాన్(PUBG Game ban) చేసింది. ఆ తరువాత ఈ గేమ్ తన పేరు మార్చుకొని మళ్లీ దేశంలో అందుబాటులోకి వచ్చింది. 


అయితేనేం.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా.. ప్రభుత్వం కూడా తన పని తాను చేసుకుపోయింది. యథావిధిగా ఆ గేమ్‌పై సైతం బ్యాన్ విధించింది. పబ్‌జీ గేమ్‌ కాస్తా.. బీజీఎంఐ(BGMI)గా మారిపోయింది. పబ్‌జీ అంటే(PUBG means).. ప్లేయర్స్‌ అన్‌నోన్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌. అయితే బీజీఎంఐ అంటే(BGMI means) బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా. మొత్తానికి ప్రభుత్వ ఆదేశాలతో ఈ గేమ్ కూడా బ్యాన్ అయిపోయింది.


ప్రభుత్వ ఉత్తర్వును అనుసరించి గూగుల్(Google), ఆపిల్(Apple) సంస్థలు గురువారం బీజీఎంఐని తమ సంబంధిత యాప్ స్టోర్‌ల నుంచి తొలగించేశాయి. ఈ నెల ప్రారంభంలో ఈ గేమ్ 100 మిలియన్ వినియోగదారులను అధిగమించిందని బీజీఎంఐ ప్రతినిధులు వెల్లడించారు. భారతదేశంలో అత్యంత ఇష్టపడే గేమ్‌గా బీజీఎంఐ(BGMI) ఒక సంవత్సరం పూర్తి చేసిందని కూడా పేర్కొంది. గత సంవత్సరం గేమ్ డెవలపర్ భారతదేశంలోని స్థానిక వీడియో గేమ్, ఇ-స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్టప్‌లను మెరుగుపరచడానికి దాదాపు 100 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి ఒక గేమింగ్ స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్‌ను నిర్మించింది.


Updated Date - 2022-07-29T17:54:41+05:30 IST