Vijayawada: ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు..

ABN , First Publish Date - 2022-09-22T17:33:17+05:30 IST

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ (Kanakadurgamma) అమ్మవారి ఆలయంలో...

Vijayawada: ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు..

విజయవాడ (Vijayawada): ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ (Kanakadurgamma) అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పది రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. శ్రీ దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారికి చేయు అలంకారాలు, కట్టే చీర రంగు, నైవేద్యం వివరాలు..


26-09-22 సోమవారం - పాఢ్యమి - స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - బంగారు రంగు చీర - కట్టెపొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసం

27-09-22 మంగళవారం - విదియ - శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి - లేత గులాబీ రంగు చీర - పులిహార..

28-09-22 బుధవారం - తదియ - శ్రీ గాయత్రీ దేవి - కాషాయ లేదా నారింజ రంగు చీర - కొబ్బరి అన్నం , కొబ్బరి పాయసం..

29-09-22 గురువారం - చవితి - శ్రీ అన్నపూర్ణ దేవి - గంధపురంగు లేదా పసుపు రంగు చీర - దద్దోజనం, క్షీరాన్నం , అల్లం గారెలు..

30-09-22 శుక్రవారం - పంచమి - శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - కుంకుమ ఎరుపు రంగు చీర - దద్దోజనం, క్షీరాన్నం..

01-10-22 శనివారం - షష్ఠి - శ్రీ మహాలక్ష్మీ దేవి - గులాబీ రంగు చీర - చక్కెర పొంగలి, క్షీరాన్నం..

02-10-22 ఆదివారం - సప్తమి - శ్రీ సరస్వతు దేవి - తెలుపు రంగు చీర - దద్దోజనం , కేసరి , పరమాన్నం

03-10-22 సోమవారం - అష్టమి - శ్రీ దుర్గా దేవి - ఎరుపు రంగు చీర - కదంబం , శాకాన్నం..

04-10-22 మంగళవారం - నవమి - శ్రీ మహిషాసురమర్ధిని దేవి - ముదురు ఎరుపు రంగు చీర - చక్కెర పొంగలి..

05-10-22 బుధవారం - దశమి - శ్రీ రాజరాజేశ్వరి దేవి - ఆకుపచ్చ రంగు చీర - లడ్డూలు, పులిహోర, బూరెలు, గారెలు, అన్నం..

Updated Date - 2022-09-22T17:33:17+05:30 IST