వాట్సాప్‌ యూజర్లూ మోడిఫైడ్‌ యాప్స్‌తో జాగ్రత్త

ABN , First Publish Date - 2021-08-28T06:00:42+05:30 IST

గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్‌ మోడిఫైడ్‌ వెర్షన్‌లు డివైస్‌లకు ఇబ్బందులను కలుగజేస్తున్నాయని కాస్పర్‌స్కై రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు...

వాట్సాప్‌ యూజర్లూ మోడిఫైడ్‌ యాప్స్‌తో జాగ్రత్త

గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్‌ మోడిఫైడ్‌ వెర్షన్‌లు డివైస్‌లకు ఇబ్బందులను కలుగజేస్తున్నాయని కాస్పర్‌స్కై రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. ప్లాట్‌ఫారాన్ని మరింత భద్రంగా చేసే పనిలో భాగంగా గూగుల్‌ ప్లే స్టోర్‌ చాలా యాప్‌లను నిషేధించింది. అయితే పలు యాప్‌లకు చెందిన మోడిఫైడ్‌ వెర్షన్స్‌ వచ్చి చేరుతున్నాయి. వాట్సాప్‌నకు సంబంధించి ఇలాంటిదే ఆండ్రాయిడ్‌ కోసం వచ్చింది. ‘ట్రోజన్‌ ట్రయిడా’ అని దీనిని పిలుస్తున్నారు. దీన్ని ‘మాల్వేర్‌’గా  ‘కాస్పర్‌స్కై’ రీసెర్చర్లు కనుగొన్నారు. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే భవిష్యత్తులో యూజర్‌కు తెలియకుండానే అనుమానాస్పద యాక్టివిటీలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎవరైనా తెలియక దీనిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే సబ్‌స్క్రయిబర్‌ ఐడి, మాక్‌ అడ్రస్‌లను తీసుకుని రిమోట్‌ సర్వర్లకు పంపుతోంది. ఒక్కోసారి వీటితో అకౌంట్‌పై కంట్రోల్‌ తప్పే ప్రమాదం కలుగుతోంది.  అందువల్ల ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని  కాస్పర్‌స్కై రిసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2021-08-28T06:00:42+05:30 IST