పులి ఉంది జాగ్రత్త

ABN , First Publish Date - 2021-07-28T06:51:50+05:30 IST

నారాయణవనం మండలం సింగిరికోనకు పోయే దారిలో పులి సంచరిస్తుండడంతో భక్తులు ఒంటరిగా లేక ద్విచక్ర వాహనాలలో వెళ్లరాదని అటవీ, పోలీసు శాఖ అధికారులు మంగళవారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశాయి.

పులి ఉంది జాగ్రత్త
పులి హెచ్చరిక బోర్డు

సింగిరి కోనలో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు


పుత్తూరు, జూలై 27: నారాయణవనం మండలం సింగిరికోనకు పోయే దారిలో పులి సంచరిస్తుండడంతో  భక్తులు ఒంటరిగా లేక ద్విచక్ర వాహనాలలో వెళ్లరాదని అటవీ, పోలీసు శాఖ అధికారులు మంగళవారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశాయి. ఈ కోనకు ఈ నెల 25వ తేదీన ద్విచక్రవాహనంలో వెళుతున్న భార్యాభర్తల మీద చిరుతపులి దాడి చేసి గాయపరచిన సంఘటన తెలిసిందే. లక్ష్మీనరసింహస్వామి వెలసిన ఈ కోనకు ప్రతి రోజు 500 మంది భక్తులు వెళుతుంటారు. పండుగ రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువ. ఈ కోనకు వెళ్లే భక్తులు కొమ్మాలమ్మ చెరువు కట్ట నుంచి ఏర్పాటు చేసిన రోడ్డు మీదుగా అటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. చిరుతదాడి తొలి అనుభవం కావడంతో పరిసర గ్రామాలైన చిరంజీవియానాదికాలనీ, నాగిలేరు. వెంకటకృష్ణపాలెం, కీళగరం, గోవిందప్పనాయుడుకండ్రిగ రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. సింగిరికోన వున్న అడవి నాగలాపురం వరకు విస్తరించి ఉన్నందున ఆ పులి సంచారం ఏ దిశలో సాగుతుందనే ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై విచారిస్తున్నామని, పులి అడుగులను సేకరిస్తున్నట్లు పుత్తూరు అటవీ శాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. 


Updated Date - 2021-07-28T06:51:50+05:30 IST