నిప్పుతో జాగ్రత్త

ABN , First Publish Date - 2021-04-14T05:55:53+05:30 IST

ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. అగ్ని ప్రమాదాలకు మండే ఎండలు, విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌తో పాటు అజాగ్రత్త కారణమవుతున్నాయి.

నిప్పుతో జాగ్రత్త

నేడు జాతీయ అగ్నిమాపక దినోత్సవం

ఏడాదిలో 299  ప్రమాదాలలో 2 కోట్ల 55 లక్షల 3 వేల ఆస్తి నష్టం

రూ.13.83 కోట్ల ఆస్తులు  కాపాడిన  అగ్నిమాపక సిబ్బంది 


కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 13 : ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. అగ్ని ప్రమాదాలకు మండే ఎండలు, విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌తో పాటు అజాగ్రత్త కారణమవుతున్నాయి. ఈ ప్రమాదాలలో కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలవటంతోపాటు మను షుల ప్రాణాలు పోతున్నాయి. వేసవి కాలం వచ్చిందంటే చాలు జిల్లా లో నిత్యం ఏదో ఒక చోట ఫైర్‌ ఇంజన్‌ గంట మోగుతూనే ఉంటుంది. అగ్ని ప్రమాదాలతో పాటు ఏదైన ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే బాధ్యత ఫైర్‌ సిబ్బందిదే కావడంతో అగ్నిమాపక శాఖ సిబ్బం ది నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు సాధ్యమైనంత వరకు ఆస్తి, ప్రాణాలు కాపాడటానికి సిబ్బంది నిర్వహిస్తున్న విధులు సాహసోపేతమైనవి. కొన్ని సందర్భాలలో ప్రమాదతీవ్రత ఎక్కువున్నప్పటికీ ప్రజల ప్రాణాలు కాపాడటానికి రిస్క్‌ కాల్స్‌ అటెండ్‌ చేయాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదం జరిగిందం టే అధికారులు, సిబ్బంది వెంటనే  ఘటనా స్థలానికి వెళ్ళి మంటలను అదుపులోకి తీసుకురావటం, ఆపదలో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించటం వారి విధి. అగ్నిమాపకశాఖ సిబ్బంది ధైర్యసాహసాలతో విధులను నిర్వహించి విలువైన ఆస్తులు, ప్రాణాలను రక్షిస్తున్నారు. 2020 లో కరీంనగర్‌ జిల్లాలో 299 అగ్నిప్రమాదాలు జరిగాయి. ఇందులో 2 కోట్ల 55 లక్షల 3 వేల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లగా, మరో 13 కోట్ల 83 లక్షల 26 వేల రూపాయల  ఆస్తులను అగ్నిప్రమాదాల నుం చి సిబ్బంది రక్షించారు. అలాగే 7 పశువులు ప్రాణాలు కోల్పోగా, మరో 15 పశువుల ప్రాణాలను రక్షించారు.  


జాగ్రత్తలతో అగ్నిప్రమాదాలను అరికట్టవచ్చు


చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే 80 శాతం వరకు అగ్నిప్రమాదాలను అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సూచనలపై వేసవి కాలంలో అగ్నిమాపకశాఖ అధికారులు విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్స్‌, భారీ వాణిజ్య సముదాయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ప్రమాదాలపై మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. ఈ జాగ్రత్తలను పాటించటంలో ప్ర జలు నిర్లక్ష్యంగా వ్యవహరించ టం మూలంగానే అధిక శాతం ప్రమాదాలు సంభవిస్తున్నాయని అగ్ని మాపకశాఖ సిబ్బంది చెబుతున్నారు. 

 కరీంనగర్‌ జిల్లాలో కరీం నగర్‌ ఫైర్‌స్టేషన్‌లో మల్టీపర్పస్‌ వాట్‌ టెండర్‌తోపాటు మినివాటర్‌ టెండర్‌(ఫైర్‌ ఇంజన్‌)లు, రెండు మిస్టి బుల్లెట్‌లు, మానకొండూర్‌, చొప్పదండి, జమ్మికుంటలలో మిని వాటర్‌ టెండర్‌, ఒక మిస్టిబుల్లెట్‌లు, హుజురాబాద్‌లో మల్టీపర్పస్‌ వాటర్‌ టెండర్‌, మిస్టుబుల్లెట్‌లు ఈ ఫైర్‌స్టేషన్‌లో ఫైరింజన్‌ లతో పాటు ఇతర ఫైర్‌ నియంత్రణ పరికరాలు, పెద్ద వలలు, నిచ్చెనలు అందు బాటులో ఉంటాయి.    


బహుళ అంతస్థుల్లో కానరాని చర్యలు


జిల్లా వ్యాప్తంగా బహుళ అంతస్థులు కలిగిన ప్రైవేట్‌ ఆసుపత్రులు, పాఠశాలలు, అపార్ట్‌మెంట్స్‌, వాణిజ్య సముదాయాల్లో అగ్నిమాపక నియంత్రణ చర్యలు శూన్యంగా ఉన్నాయి. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ముందస్తుగా అగ్ని ప్రమా దాలను అరికట్టే పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం నిబం ధనలు విధించినప్పటికీ అమలు కావటం లేదు. నిర్మాణం సమయంలోనే మున్సిపాలిటీ అధికారులు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్వహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అగ్నిమాపకశాఖ నుంచి నో ఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే ఆ యా పాఠశాలలు, ఆసుపత్రులకు ప్రభుత్వం లైసెన్స్‌లు మంజూరీ చే స్తుంది. జిల్లాలో 270 పైగా ప్రైవేట్‌ ఆసుపత్రులు మరో 500 వరకు వి ద్యాసంస్థలు ఉండగా ఇందులో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే నా మమాత్రపు అగ్నిప్రమాదాల నియంత్రణ పరికరాలు కలిగి ఉన్నాయి.  

ని


జాతీయ అగ్నిమాపక దినోత్సవ నేపథ్యం


1944 ఏప్రిల్‌ 14న ముంబాయి విక్టోరియా డాక్‌ యార్డులో ఒక నౌకకు అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అదుపులోకి తీసుకురావడానికి అక్కడ విధి నిర్వహణలో ఉన్న 66 మంది అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అగ్ని మా పక సిబ్బంది స్మారకార్ధం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 14న దేశ వ్యాప్తం గా అగ్నిమాపక దళ దినోత్సవం జరుపుతున్నారు. ప్రజలను చైతన్య వంతు లను చేయడానికి బుధవారం నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహి స్తున్నారు. అగ్నిమాపకశాఖ ఒక అగ్నిప్రమాదాలకే పరిమితం కాకుండా వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటుంది. 


 

------------------------------------------------------------------------------------------------------

సంవత్సరం. ప్రమాదాలు  ఆస్తినష్టం ఆస్తులరక్షణ  కాపాడిన పశువులు   పశువుల మృతి

---------------------------------------------------------------------------------------------------------------

2018        311       1.27 కోట్లు   14.02 కోట్లు        4                 8

1019        400       2.17         9.94              2                 7

2020        299       2.55        13.83              7                 15

2021(మార్చి) 48        0.21         1.31              4                  4    

Updated Date - 2021-04-14T05:55:53+05:30 IST