ఆ సందేశాలతో జాగ్రత్త.. దేశ పౌరులు, ప్రవాసులకు Kuwait హెచ్చరిక!

ABN , First Publish Date - 2021-10-24T17:19:37+05:30 IST

కువైత్ సమాచార మంత్రిత్వశాఖ దేశ పౌరులు, ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

ఆ సందేశాలతో జాగ్రత్త.. దేశ పౌరులు, ప్రవాసులకు Kuwait హెచ్చరిక!

కువైత్ సిటీ: కువైత్ సమాచార మంత్రిత్వశాఖ దేశ పౌరులు, ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆగంతకుల నుంచి వచ్చే ఈ-మెయిల్స్, ఎలక్ట్రానిక్ లింక్స్‌కు స్పందించకపోవడం మంచిదని తెలియజేసింది. మీకు పార్శిల్ వచ్చిందంటూ నివాసితులకు ఇలా సంబంధంలేని లింక్స్ పంపించి కొందరు కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా మంత్రిత్వశాఖ ఈ అలెర్ట్ జారీ చేసింది.


అందుకే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పార్శిల్ పేరుతో వచ్చే ఎలక్ట్రానిక్ లింక్స్‌కు నగదు పంపించి మోసపోవద్దని సంబంధిత అధికారులు ప్రవాసులు, దేశ పౌరులను సూచించారు. ఈ మేరకు మంత్రిత్వశాఖ అధికారిక సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో కూడా ప్రత్యేక ప్రకటనలు ఇచ్చింది. ఇలా ఎదైనా అనుమానాస్పద లింక్స్ వస్తే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు. సాధ్యమైనంత వరకు ఈ ఫేక్ మెసేజ్‌లకు స్పందించకపోవడం బెటర్ అని చెప్పుకొచ్చారు.    

Updated Date - 2021-10-24T17:19:37+05:30 IST