కత్తికట్టిన కోడి

ABN , First Publish Date - 2021-01-16T05:49:35+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా అనకాపల్లి మండలం సుందరయ్యపేటలోని అనాథాశ్రమం వెనుక వున్న ఖాళీ స్థలాల్లో గురు, శుక్రవారాల్లో కోడిపందాలు నిర్వహించారు.

కత్తికట్టిన కోడి
సుందరయ్యపేటలో కోడి పందాలు ఆడుతున్న దృశ్యం

అనకాపల్లి, కశింకోట సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందాలు


కొత్తూరు, జనవరి 15: సంక్రాంతి పండుగ సందర్భంగా అనకాపల్లి మండలం సుందరయ్యపేటలోని అనాథాశ్రమం వెనుక వున్న ఖాళీ స్థలాల్లో గురు, శుక్రవారాల్లో కోడిపందాలు నిర్వహించారు. కోళ్లకు కత్తులు కట్టి వేలాది రూపాయలు పందాలు కాశారు. ఇదే ప్రాంతంలో గుళ్లాటలు కూడా నిర్వహించారు. వంద మొదలుకొని వెయ్యి రూపాయల వరకు బెట్టింగులు కాశారు. పోలీసుల హెచ్చరికలను కోడి పందాల నిర్వాహకులు ఏ మాత్రం ఖాతరు చేయలేదు.


కశింకోట మండలంలో...


కశింకోట మండలంలోని అడ్డాం, చెరకాం, బుచ్చెయ్యపేట గ్రామాల్లో తీర్థాల సందర్భంగా కోడి పందాలు జోరుగా సాగాయి. ఆయా గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో పట్టపగలు కోడి పందాలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడంలేదు. కాగా, జిల్లాలో కోడి పందాలు వేస్తున్న 38 మందిని అరెస్టు చేసి, 13 పందెం కోళ్లు, రూ.38 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు.

Updated Date - 2021-01-16T05:49:35+05:30 IST