ప్రభుత్వ ఆస్పత్రిలోనే మెరుగైన వైద్యం

ABN , First Publish Date - 2022-08-20T04:32:22+05:30 IST

ప్రభుత్వ ఆస్ప త్రులలోనే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందు తున్నాయని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలోనే మెరుగైన వైద్యం
బాలింతలకు పండ్లు, స్వీట్స్‌ అందజేస్తున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

- ఎంసీహెచ్‌లో అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి

- బాలసదన్‌ చిన్నారులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్‌

వనపర్తి వైద్యవిభాగం, ఆగస్టు 19: ప్రభుత్వ ఆస్ప త్రులలోనే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందు తున్నాయని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆమె జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని, జిల్లా జనరల్‌ ఆస్పత్రి, వృద్ధాశ్రమం, చిల్డ్రన్‌ హోమ్‌లను పరిశీలించి రోగులకు పండ్లు, స్వీట్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా విద్యా, వైద్య రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తుందని, ప్రభు త్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతు న్నాయని అన్నారు. ఎక్కువ ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతుండటం శుభపరిణామనన్నా రు.  వైద్యసేవల గురించి బాలింతలను అడిగి తెలు సుకున్నారు. ప్రొఫెసర్‌ సరోజ సూద్‌ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి వారికి పండ్లు, స్వీట్స్‌ పంపిణీ చేశారు. అనంతరం బాలసదన్‌లో చిన్నారులతో సరదాగా గడిపి వారితో కలిసి భోజనం చేశారు. పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మునిసిప ల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రవిశంకర్‌, మెడికల్‌ కళాశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌, డాక్టర్‌ రాజ్‌కుమార్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సునందిని, ఆర్‌ఎంవో డాక్టర్‌ చైతన్యగౌడ్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ ఖాజా కుతు బుద్దీన్‌, జిల్లా సంక్షేమాధికారి పుష్పలత, ఎమ్మార్వో రాజేందర్‌గౌడ్‌, రెడ్‌క్రాస్‌ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల కృష్ణసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

 



Updated Date - 2022-08-20T04:32:22+05:30 IST