మారుమూల గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం

ABN , First Publish Date - 2022-08-20T05:11:50+05:30 IST

మారుమూల గ్రామాలకు మెరుగైన రవాణాసౌకర్యాలు కల్పిస్తున్నామని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

మారుమూల గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం
బీటీరోడ్డు పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

 ఇల్లంతకుంట, ఆగస్టు 19: మారుమూల గ్రామాలకు మెరుగైన రవాణాసౌకర్యాలు కల్పిస్తున్నామని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలంలోని రేపాకలో శుక్రవారం రూ.2కోట్ల 50లక్షల అంచనాతో కిష్టాపూర్‌ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. మెరుగైన రవాణా సౌకర్యం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక గ్రామాలు అభివృద్ధిలో పట్టణాలతో పోటీపడుతున్నాయన్నారు. అంతకుముందు శ్రీరామాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మామిడి సంజీవ్‌, సర్పంచ్‌ రొండ్ల లక్ష్మి, ఎంపీటీసీ కాథ సుమలతమల్లేశం, ఫ్యాక్స్‌ చైర్మన్‌ రొండ్ల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె అయిలయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఎండ్ర చందన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T05:11:50+05:30 IST