గ్రామ సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు

ABN , First Publish Date - 2022-08-15T04:48:46+05:30 IST

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు సత్వరమే అందుతాయని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

గ్రామ సచివాలయాల ద్వారా  మెరుగైన సేవలు
శిలాఫలకాన్ని అవిష్కరిస్తున్న కృష్ణచైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య

బల్లికురవ, ఆగస్టు 14: గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు సత్వరమే అందుతాయని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మండలంలోని వేమవరంలో ఆదివారం గ్రామ సచి వాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కృష్ణచైతన్య మాట్లా డుతూ గతంలో ప్రజలు తమ పనులపై మండల కేంద్రానికి రావల్సి ఉండేదని, ఇప్పుడు గ్రామాలలో అవి పరిష్కారం అవుతున్నాయన్నారు. అనంతరం పొలేర మ్మ దేవాలయంలో కృష్ణచైతన్య పూజలు నిర్వహించారు. 

కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ చింతల పేరయ్య, ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి, సొసైటీ చైర్మన్‌ ఒంగోలు సుబ్బారావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, సర్పంచ్‌ దూళి పాళ్ల సుబ్బయ్యచౌదరి, గోరంట్ల వెంకటేశ్వర్లు, మండల నేతలు చింతల శ్రీనివాస రావు, ప్రసాదరెడ్డి, పావులూరి చందు, మాదాల శివన్నారాయణ, నరేష్‌, ముత్యాల రావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T04:48:46+05:30 IST