కొవిడ్‌ బాధితులకు మెరుగైన సేవలందించాలి

ABN , First Publish Date - 2021-05-07T05:39:37+05:30 IST

జిల్లాలో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి వైద్యులు, సిబ్బందికి సూచించారు. గురువారం జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ నారాయణరెడ్డి సందర్శించారు.

కొవిడ్‌ బాధితులకు మెరుగైన సేవలందించాలి
జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

వైద్యులు, సిబ్బందికి కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశం

పెద్దబజార్‌, మే 6: జిల్లాలో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి వైద్యులు, సిబ్బందికి సూచించారు. గురువారం జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ నారాయణరెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో తి రిగి తనిఖీలు నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు కలెక్టర్‌ ఆయా వార్డులను సందర్శిస్తూ అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కరోనా బాఽధితులకు సంబంధించి న దుప్పట్లు, ఇతర దుస్తులు శుభ్రపరిచే ప్రదేశాన్ని పరిశీలించి పలు జాగ్రత్తలు సూచించారు. ఇన్ఫెక్షన్‌ ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. అనంత రం ఆయా వార్డులలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి సంబంధిత అదికారులను అడిగి తెలుసుకున్నా రు. వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లకు తావుండరాదని బాఽధితులలో నమ్మకం పెంపొందించేలా వారితో వైద్యు లు, సిబ్బంది సత్ప్రవర్తనతో మెలగాలని హితవుపలికా రు. అప్పుడే ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. కలెక్టర్‌ వెంట ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండె ంట్‌ డాక్టర్‌ హరిశ్చంద్రరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌  బాల్‌రాజ్‌, డాక్టర్‌ సరస్వతి, డాక్టర్‌ ఫరిదాఉన్నారు. 

1,200ల మెడికల్‌ టీంల ద్వారా ఆరోగ్య సర్వే

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలలో 1,200ల మెడికల్‌ టీంల ద్వారా ఇంటింటికీ తిరి గి ప్రజల ఆరోగ్య సర్వే నిర్వహించడం జరుగుతోందని కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా వై ద్యాధికారి, ఆర్డీవోలు, డిప్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌లు, ము న్సిపల్‌ కమిషనర్‌లతో ఆయన సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జి ల్లాలో నిర్వహిస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వేను సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు ఆదే శాలు జారీ చేశారు. జిల్లాలో గురువారం నుంచి అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డులలో వైద్యాధికారులు, ఏఎన్‌ ఎంలు, అంగన్‌వాడీ, ఆశ వర్కర్‌లతో కూడిన 1,200ల టీంలతో ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వేలో ఎంతమందిని పరీక్షించారు? ఎంతమందికి లక్షణాలు ఉ న్నాయి? ఎంతమందికి మందుల కిట్‌లు పంపిణి చేశారో అడిగి తెలుసుకున్నారు. లక్షణాలు కనిపించిన వారికి త ప్పనిసరిగా మందుల కిట్‌లు అందజేయాలని, నిర్ణీత ఫా ర్మాట్‌లో అన్ని వివరాలు పొందుపర్చి ఏ రోజుకారోజు ని వేదిక సమర్పించాలన్నారు. కిట్‌ల కొరత రాకుండా ముం దస్తుగానే ప్లాన్‌ చేసుకోవాలన్నారు. సర్వేకు హాజరుకాని సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో సిబ్బంది అంతా చి త్తశుద్ధితో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉం టాని హెచ్చరించారు. అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఓపీ సేవ లు ప్రారంభమైనందున ఓపీ సేవలకు సంబంధించి ఆ సుపత్రుల ముందు బ్యానర్‌లు కట్టి రోగులకు అన్ని సౌకర్యాలు అందజేయాలన్నారు. 

1,828 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తింపు 

గురువారం జిల్లాలోని 530 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలలో 1,200 ఆరోగ్య బృందాలు మొదటి రో జు 56వేల 403 ఇళ్లలో సర్వే నిర్వహించగా 1,828 మం దికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు కలెక్టర్‌ తెలిపారు. 2,072 మందికి ఓపీలో వైద్య పరీక్షలు చేసి 629 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మందులు ఇచ్చిన ట్లు ఆయన తెలిపారు. శుక్రవారం కూడా జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే, ఓపీ సేవలు నిర్వహిస్తామని, ప్రజలు ఎ వరైనా అనారోగ్య సమస్యలున్నవారు ఇంటింటి సర్వేకు వచ్చే బృందాలకు తమ సమస్యలు చెబితే వారు ఇచ్చే మందుల ద్వారా సత్వర వైద్యం పొందవచ్చని కలెక్టర్‌ తెలిపారు. ఆరోగ్య బృందాలకు ప్రజలంత సహకరించాల ని ఆయన కోరారు.

Updated Date - 2021-05-07T05:39:37+05:30 IST