యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు మెరుగైన సేవలు

ABN , First Publish Date - 2020-06-30T11:28:53+05:30 IST

యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తామని చీఫ్‌ మేనేజర్లు బి.రవికిశోర్‌ (సరళ్‌

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు మెరుగైన సేవలు

భీమవరం టౌన్‌ / ఏలూరు రూరల్‌, జూన్‌ 29: యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తామని చీఫ్‌ మేనేజర్లు బి.రవికిశోర్‌ (సరళ్‌ విభాగాధిపతి), నండూరి వేణుగోపాల్‌ తెలిపారు. కొత్త రీజినల్‌ విధానాన్ని సోమవారం ప్రారంభించారు.


జిల్లాలో 114 ఆంధ్రా బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా 20, కార్పొరేషన్‌ బ్యాంక్‌ 11శాఖల్లో కొత్త విధానంతో మెరుగైన సేవలందించేందుకు భీమవరం, ఏలూరులలో రెండు రీజి యన్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. భీమవరం రీజియన్‌లో విలీనమైన 75 శాఖలతో రూ.2757 కోట్ల డిపాజిట్లు, రూ.3810 కోట్ల రుణాలతో మొత్తం రూ. 6566 కోట్ల వ్యాపారం కలిగి ఉందన్నారు ఈ కార్యక్రమాల్లో ఏలూరు నూతన రీజనల్‌ మేనేజర్‌ ఐఎస్‌ఎన్‌.మూర్తి, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కోటేశ్వరరావు మేనేజర్లు జి.లక్ష్మణ్‌, రామోహన్‌రావు, రఽఘు, జీవీ.రావు, ఎల్‌డీఎం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-30T11:28:53+05:30 IST