Abn logo
Sep 23 2021 @ 23:50PM

రైతులకు మెరుగైన సేవలందించాలి

ఎమ్మెల్యే బలరాంతో పేరాల హైస్కూల్‌ విద్యాకమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు

ఎమ్మెల్యే కరణం బలరాం

చీరాల, సెప్టెంబరు 23: రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఎ మ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు. గురువారం వేటపాలెం నుంచి సంతరావూరు వరకు రొంపేరు కాలువను అధికారులతో కలిసి పరిశీ లించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను విన్నవించుకు న్నా రు. బలరాం స్పందిస్తూ రైతుల స మస్యలను పరిష్కరిస్తామన్నారు. నీ టిపారుదాల శాఖ, డ్రైయినేజీ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులు సాగుచేసిన పంటలకు సక్రమంగా సాగునీరు అం దించాలని చెప్పారు. వరదలు, తుఫాన్ల సమయాల్లో పొలాలు ముంపు నకు గురై పంట నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవా లన్నారు. కార్యక్రమంలో దేవాంగ కార్పొరేషన్‌ చైర్మన్‌ బీరక సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌

విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఎమ్మెల్యే కరణం బల రామకృష్ణమూర్తి అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పేరా ల ఏఆర్‌ఏం విద్యాకమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఆయనను కలిసి సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా తనవం తు సహకారం ఎప్పుడూ ఉం టుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీని వాసరావు, కౌన్సిలర్లు లతిత, జగ దీష్‌, స్కూల్‌ విద్యాకమిటీ కమిటీ ప్రతినిధులు, శ్రీకామాక్షికేర్‌ హా స్పటల్‌ ఎండీ తాడివలస దేవరా జ్‌, యదాలమ్మ, రాజశే ఖర్‌, సరో జనిదేవి, మునీర్‌ఖాన్‌, హెచ్‌ఎం సాల్మన్‌రాజు  పాల్గొన్నారు.

చేపల విక్రయదారుల సమస్యల పరిష్కారానికి కృషి

వేటపాలెం వై.జంక్షన్‌లో చేపల విక్రయాలు జరుపుకుంటూ జీవనం  సాగిస్తున్నవారి విన్నపం మేరకు బలరాం ఆ ప్రాంతాన్ని సందర్శిం చారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. సమస్యల పరిష్కా రానికి, మెరుగైన జీవనోపాధికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్యశాఖ అధికారులతో మాట్లాడారు.

కాగా, చీరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పుల్కా వెంక టేశ్వర్లుగా చిరపరిచితుడైన వెంకటేశ్వర్లు మృతి బాధాకరమని ఎమ్మె ల్యే కరణం బలరాం అన్నారు. గురువారం వెంకటేశ్వర్లు పెదఖర్మ కా ర్యక్రమంలో పాల్గొని, ఆయన చిత్రపటానికి నివాళులర్పించి,  కుటుం బసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే బలరాం వెంట మున్సిపల్‌ చైౖర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్‌ చైర్మన్‌ బీరక సురేంద్ర తదితరులు ఉన్నారు.