శాస్త్రీయ పద్ధతితో మెరుగైన ఫలితాలు

ABN , First Publish Date - 2022-07-02T04:58:59+05:30 IST

భూగర్భ జలాల పెంపునకు వ్యూహాత్మక ప్రణాళిక, శాస్త్రీయ పద్ధతిలో ముందుకెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కేంద్ర ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వశాఖ సెంట్రల్‌ నోడల్‌ అధికారి డైరెక్టర్‌ డోనర్‌ హవోకివ్‌ పేర్కొన్నారు.

శాస్త్రీయ పద్ధతితో మెరుగైన ఫలితాలు
మాట్లాడుతున్న నోడల్‌ అధికారి డోనర్‌ హవోకివ్‌

కేంద్ర ప్రభుత్వ జల వనరుల మంత్రిత్వ శాఖ నోడల్‌ అధికారి డోనర్‌ హవోకివ్‌

మెదక్‌ అర్బన్‌, జూలై 1:  భూగర్భ జలాల పెంపునకు వ్యూహాత్మక ప్రణాళిక, శాస్త్రీయ పద్ధతిలో ముందుకెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కేంద్ర ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వశాఖ సెంట్రల్‌ నోడల్‌ అధికారి డైరెక్టర్‌ డోనర్‌ హవోకివ్‌ పేర్కొన్నారు. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నీటి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల భూగర్భ జల మట్టాలు పెరిగాయన్నారు. నీటి సంరక్షణకు చెక్‌డ్యాంలు, పర్కొలేషన్‌ ట్యాంకుల నిర్మాణం, వాటర్‌షెడ్స్‌, ఫామ్‌పాండ్స్‌, సామూహిక  ఇంకుడు గుంతల నిర్మాణం వంటివి గ్రామీణ ఉపాధి హామీ పథకం, సోషల్‌ ఫారెస్ట్రీ, నీటి పారుదల తదితర శాఖల ద్వారా చేపట్టే కార్యక్రమాలు జలాల పెంపునకు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, శాస్త్రవేత్త, టెక్నికల్‌ ఆఫీసర్‌ పాటిల్‌, డీఆర్డీవో శ్రీనివా్‌సతోపాటు పలు శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-02T04:58:59+05:30 IST