నైపుణ్యాలు పెంచుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో

ABN , First Publish Date - 2022-08-14T05:41:32+05:30 IST

ఉపాధ్యాయులు అభ్యసనంలో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ విద్యార్థులకు సులభ పద్ధతిలో బోధించి ఉత్తమ ఫలి తాలు సాధించడానికి కృషి చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి పురుషోత్తం పేర్కొన్నారు.

నైపుణ్యాలు పెంచుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో
శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో డీఈవో

గంగవరం, ఆగస్టు 13: ఉపాధ్యాయులు అభ్యసనంలో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ విద్యార్థులకు సులభ పద్ధతిలో బోధించి ఉత్తమ ఫలి తాలు సాధించడానికి కృషి చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి పురుషోత్తం పేర్కొన్నారు. శనివారం పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మండలంలోని ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ‘సార్ట్‌-టీచ్‌  టూర్‌’ శిక్షణ కార్యక్రమాన్ని డీఈవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ...  తరగతి గదిలో జరిగే బోధనాభ్యాస కార్యక్ర మాల నిర్వహణపై ఇస్తున్న శిక్షణ ఉపాధ్యాయులకు చాలా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఇటు వంటి శిక్షణ కార్యక్రమాలతో వృత్తిపరమైన సామ ర్థ్యాలను ఉపాధ్యాయులు నిరంతరం పెంపొందించు కోవ డానికి మంచి అవకాశమన్నారు. ఉపాధ్యా యులు బోధనా సామర్థ్యం పెంపొందించుకొని విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో బోధించ డం ద్వారా  ఉత్తీర్ణత శాతం పెరగడానికి దోహదపడుతుందన్నారు. డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్‌ విజయశేఖర్‌రెడ్డి  మాట్లాడు తూ...  వృత్తిపరమైన ఇబ్బందులను అధి గమించి అభ్యసనంలో నైపుణ్యం సాధించి, నూతన ఒరవడితో బోధన చేయడానికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు  ఉప యోగపడతాయన్నారు. ఆర్పీలు మునిచంద్ర, బిందుప్రియాసింగ్‌, కోర్స్‌ డైరక్టర్‌ లీలారాణి, సీఆర్పీలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-14T05:41:32+05:30 IST