బస్తీ దవాఖానాలతో మెరుగైన వైద్యసేవలు

ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST

బస్తీ దవాఖానాలతో మెరుగైన వైద్యసేవలు

బస్తీ దవాఖానాలతో మెరుగైన వైద్యసేవలు
అన్నోజిగూడలోని బస్తీ దవాఖాన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న జాన్‌శాంసన్‌

ఘట్‌కేసర్‌, జూలై 2 :  ప్రజలకు మెరుగైన వైద్యం అందివ్వడానికే ప్రభుత్వం బస్తీ దవాఖానాల ఏర్పాటుకు  శ్రీకారం చుట్టిందని మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ జాన్‌ శాంసన్‌ అన్నారు. శనివారం ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లోని బస్తీ దవాఖానాల్లో ఏర్పాట్లు, నిర్మాణ పనులను పరిశీలించారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ బస్తీ దవాఖానా నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ బాలాజీ నగర్‌లో గల కమ్యూనిటీ హాల్‌లో నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాను అదనపు కలెక్టర్‌ పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావనీ జంగయ్యయాదవ్‌, కమిషనర్‌ వసంత, పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ రెడ్డియానాయక్‌, కమిషనర్‌ సురేష్‌, నాయకులు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:30:00+05:30 IST