చేర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు

ABN , First Publish Date - 2022-10-04T04:55:57+05:30 IST

చేర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అధునాతన వసతులతో కూడిన భవన నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం రూ.9.30 కోట్ల నిధులు మంజూరు చేసిందని, దసరా రోజున వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా భూమిపూజ చేయనున్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.

చేర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
భవన నిర్మిత స్థలాన్ని పరిశీలించి సూచనలు ఇస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.9.30 కోట్లు మంజూరు 

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల, అక్టోబరు 3: చేర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అధునాతన వసతులతో కూడిన భవన నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం రూ.9.30 కోట్ల నిధులు మంజూరు చేసిందని, దసరా రోజున వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా భూమిపూజ చేయనున్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆస్పత్రి భవన నిర్మాణానికి చేర్యాల మార్కెట్‌యార్డు ఆవరణలో కేటాయించిన స్థలాన్ని సోమవారం ఎమ్మెల్యే పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యవంత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం పాటు పడుతున్నదని, ఈ క్రమంలో హరీశ్‌రావు చొరవతో నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారన్నారు. సిద్దిపేట జిల్లాలో కలిసినప్పటి నుంచి మంత్రి చేయూతనందిస్తూ అభివృద్ధికి పాటుపడుతుండడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కాగా ఏర్పాట్ల నిర్వహణకు సంబంధించి మార్కెట్‌యార్డు సిబ్బందితో పాటు కౌన్సిలర్‌ ఆడెపు నరేందర్‌, స్థానిక నేతలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్‌, పచ్చిమడ్ల సతీష్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పుర్మ వెంకట్‌రెడ్డి, మల్లన్న ఆలయ కమిటీ డైరెక్టర్లు పచ్చిమడ్ల సిద్ధిరాములు, కందుకూరి సిద్ధిలింగం పాల్గొన్నారు.

Updated Date - 2022-10-04T04:55:57+05:30 IST