best walnut scrub: మృదువైన చర్మం కోసం వాల్నట్ స్క్రబ్..
ABN , First Publish Date - 2022-09-02T21:26:52+05:30 IST
స్క్రబ్ వాల్ నట్స్ తో అయితే చర్మానికి మరింత నిగారింపును తెస్తుంది. వాల్ నట్స్ లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
అందాన్ని కాపాడుకోవాలంటే ఆడవారు ఎన్ని తంటాలు పడాలో.. కాలి నుంచి తలవెంట్రుకల వరకూ అన్నింటి మీదా చాలా శ్రద్ధ అవసరం. చాలా శ్రద్ధ తీసుకుంటేనే చర్మం నిగారింపుతో, యవ్వనంగా కనిపిస్తుంది. అయితే ఇది పోషకాలతో నిండిన శ్రద్ధ అయితే శరీరానికి మరింత అందం వస్తుంది. స్క్రబ్ చేయడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది.
ఈ స్క్రబ్ వాల్ నట్స్ తో అయితే చర్మానికి మరింత నిగారింపును వస్తుంది. వాల్ నట్స్ లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చర్మానికి అద్భుతమైన నిగారింపును ఇచ్చి ధూళిని తొలగిస్తుంది. ఫలితంగా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
వాల్నట్ స్క్రబ్‌ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
వాల్నట్ స్క్రబ్‌ని ఉపయోగించడం వల్ల దానిలోని పోషక గుణాల వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి వృద్ధాప్య ఛాయలను తొలగించడంలో సహాయపడతాయి. ఇతర చర్మ వ్యాధులతో పాటు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదుర్కొనేలా యాంటీమైక్రోబయాల్ ఏజెంట్లతో నిండి ఉంటాయి. దీన్ని ఉపయోగించడం వల్ల మూసుకుపోయిన చర్మ రంధ్రాలను క్లియర్ చేసి, చర్మం స్మూత్‌గా అనిపించేలా చేస్తుంది.
1. జుట్టు, చర్మానికి విటమిన్ ఇ ఆయిల్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాల్నట్ స్క్రబ్స్‌లో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మెరిసేలా చేసి, ఆరోగ్యంగా ఉంచుతుంది.
2. బొప్పాయి, వాల్ నట్ బాడీ స్క్రబ్ ని వాడటం వల్ల మృత చర్మ కణాలను రంధ్రాలనుంచి మురికిని బయటకు తీయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
3. ఇంట్లో వాల్నట్ స్క్రబ్‌ను ఎలా తయారు చేయాలి.
వాల్నట్ పొడిలో తేనె, నిమ్మరసం కలపండి.
మిశ్రమంతో మీ చర్మాన్ని మసాజ్ చేయండి.
కంటి ప్రాంతంతో కాస్త సున్నితంగా రుద్దండి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. వారంలో రెండుసార్లు స్క్రబ్ చేయడంవల్ల చర్మానికి సహజ ప్రకాశాన్ని తిరిగి తీసుకురావడంలో సహాయపడుతుంది.