కరోనా బాధితులకు మెరుగైన సేవలు

ABN , First Publish Date - 2021-05-12T05:35:38+05:30 IST

జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెల్లడించారు

కరోనా బాధితులకు మెరుగైన సేవలు
జామ్‌ యాప్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(వైద్యం), మే 11 : జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సేవలు  అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెల్లడించారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా జీజీహెచ్‌, నారాయణ, జయభారత్‌, మెడికవర్‌ తదితర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల కుటుంబ సభ్యులతో కలెక్టర్‌ మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలు, పెడుతున్న ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా మెరుగైన వైద్యం అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ తెలిపారు. కరోనా బాధితులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దన్నారు. చిన్న చిన్న సమస్యలు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించారు. ఆయా ఆసుపత్రుల వైద్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు.

Updated Date - 2021-05-12T05:35:38+05:30 IST