రాస్‌-కేవీకే శాస్త్రవేత్తకు ఉత్తమ అవార్డు

ABN , First Publish Date - 2021-10-19T05:48:35+05:30 IST

కరకంబాడి వద్ద ఉన్న రాస్‌-కేవీకేలో పనిచేస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్త శ్రీనివాసులు ఉత్తమ అవార్డును అందుకున్నారు.

రాస్‌-కేవీకే శాస్త్రవేత్తకు ఉత్తమ అవార్డు
ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న శ్రీనివాసులు

రేణిగుంట, అక్టోబరు 18: మండలకేంద్ర సమీపంలోని కరకంబాడి వద్ద ఉన్న రాస్‌-కేవీకేలో పనిచేస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్త శ్రీనివాసులు ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఇటీవల డెహ్రాడూన్‌లో ఆహారం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిపై రెండురోజుల సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని చిన్నగొట్టిగల్లు మండలంచిట్టేచర్ల, దీన్‌దార్లపల్లెలో పాలిథిన్‌ మల్చింగ్‌ విధానంలో టమోటా సాగుపై శ్రీనివాసులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నీటి సంరక్షణ, కలుపు నివారణ, సాగు వ్యయం తగ్గించి అధిక దిగుబడులు సాధించడం గురించి వివరించారు. దీంతో సదస్సు నిర్వాహకులు ఆయనకు ఉత్తమ అవార్డు ఇచ్చి సత్కరించారు. అవార్డు గ్రహీతను సోమవారం రాస్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటరత్నం నాయుడు, కేవీకే శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అభినందించారు. 

Updated Date - 2021-10-19T05:48:35+05:30 IST