బ్యారేజీ రోడ్డుకు మోక్షం ఎప్పుడు

ABN , First Publish Date - 2022-06-30T07:06:06+05:30 IST

కాటన్‌ బ్యారేజీపై ధవళే శ్వరం నుంచి విజ్జేశ్వరం వరకు ఉన్న రహదారిపై ప్ర యాణం ప్రయాసగా మారింది. గుంతలు పడిన ఈ రహదారిలో ప్రయాణం చేసేవారు ఆపసోపాలు పడు తూ రాకపోకలు సాగిస్తున్నారు.

బ్యారేజీ రోడ్డుకు మోక్షం ఎప్పుడు
అధ్వానంగా మారిన కాటన్‌ బ్యారేజీ రహదారి పరిస్థితి ఇది..

రూ. 50 లక్షల అంచనాతో బీటీ రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు

ఆరు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్‌ టెండర్‌ వేయని దుస్థితి

బ్యారేజీపై గతుకుల రహదారిలో వెళ్లడానికి ఆపసోపాలు పడుతున్న ప్రయాణికులు

గాలికి వదిలేసిన ఇరిగేషన్‌ అధికారులు 8 ప్రజాప్రతినిధులూ పట్టించుకోరు

ధవళేశ్వరం, జూన్‌ 29: కాటన్‌ బ్యారేజీపై ధవళే శ్వరం నుంచి విజ్జేశ్వరం వరకు ఉన్న రహదారిపై ప్ర యాణం ప్రయాసగా మారింది. గుంతలు పడిన ఈ రహదారిలో ప్రయాణం చేసేవారు ఆపసోపాలు పడు తూ రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం వందలాది వాహనదారులు ఈ బ్యారేజీపై రాకపోకలు సాగి స్తుండగా, కొందరు గుంతల వల్ల ప్రమాదాలు బారిన పడుతున్నారు. ధవళేశ్వరం నుంచి విజ్జేశ్వరం వరకు 5.837 కిలోమీటర్లు పొడవునా ఉన్న రోడ్డు గత నాలు గు సంవత్సరాలుగా గుంతలమయంగా మారిపో యింది. 2014వ సంవత్సరంలో ధవళేశ్వరం, బొబ్బర లంక, మద్దూరు, విజ్జేశ్వరం ఆర్మ్‌లను కలుపుతూ నిర్మించిన ఎంబ్యాక్‌మెంట్‌ రోడ్డుతోపాటు ఆర్మ్‌ల పై ఉన్న కాంక్రీట్‌ నిర్మాణంపై వేసిన బీటీ లేయ ర్‌ కూడా ఛిద్రమైపోయింది. దీంతో బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షల అంచనాతో పరిపాల నా అనుమతి పొంది ఇరిగేషన్‌ అధికారులు టెం డర్లు పిలిచారు. సంవత్సరకాలంలో ఇప్పటికీ ఆరు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పం దన రాలేదు. ఈ పనులు ఏ విధంగా చేపట్టాలనే దానిపై ఇరిగేషన్‌ అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. గతంలో ఇరిగేషన్‌లో టెండర్లు దక్కించుకోవడానికి పోటీపడిన కాంట్రాక్టర్లను ప్రస్తుతం టెండర్‌ వేయమని అభ్యర్థించాల్సిన పరిస్థితి నెలకొందని ఇరిగేషన్‌ వర్గాలు అంటు న్నాయి. గతంలో పూర్తిచేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం, ప్రస్తుతం పనిచేసినా సొమ్ము లు వస్తాయో రావో అనే భయంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని సమాచారం. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గతంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా బ్యారేజీలో స్వచ్ఛందంగా మరమ్మతులు చేపట్టి నిరసన వ్యక్తంచేయాలని తలపెట్టారు. అయితే దీనికి ఇరిగేషన్‌ అధికారులు అనుమతి ఇవ్వలేదు. నిపుణుల నేపథ్యంలోనే ఈ రోడ్ల మరమ్మతులు జరపాలని, అందువల్ల ఈ కార్యక్రమం విరమించుకోవాలని కోరడంతోపాటు రెండు మూడు గుంతలను హడావుడిగా పూడ్చారు. పవన్‌ బొమ్మూరు ప్రాంతానికి తన కార్యక్రమం మార్చుకుని నిర్వహించి వెళ్లిన తర్వాత బ్యారేజీ రోడ్డును పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. 



Updated Date - 2022-06-30T07:06:06+05:30 IST