America-Chennai: 67ఏళ్ల మహిళకు గుండె జబ్బు.. రూ.1.06కోట్ల ఖర్చుతో 26 గంటల్లోనే ఇండియాకు తరలించిన కుటుంబ సభ్యులు!

ABN , First Publish Date - 2022-07-20T20:53:56+05:30 IST

గుండె జబ్బుతో బాధపడుతున్న 67ఏళ్ల వృద్ధ మహిళను ఆమె కుటుంబ సభ్యులు ఎయిర్ అంబులెన్స్ ద్వారా అగ్రరాజ్యం అమెరికా నుంచి ఇండియాకు తరలించారు. ఈ తరలింపు ప్రక్రియ కేవలం 26 గంటల్లోనే పూర్తవగా.. ఇందుకోసం సుమారు కోటి రూ

America-Chennai: 67ఏళ్ల మహిళకు గుండె జబ్బు.. రూ.1.06కోట్ల ఖర్చుతో 26 గంటల్లోనే ఇండియాకు తరలించిన కుటుంబ సభ్యులు!

ఎన్నారై డెస్క్: గుండె జబ్బుతో బాధపడుతున్న 67ఏళ్ల వృద్ధ మహిళను ఆమె కుటుంబ సభ్యులు ఎయిర్ అంబులెన్స్ ద్వారా అగ్రరాజ్యం అమెరికా నుంచి ఇండియాకు తరలించారు. ఈ తరలింపు ప్రక్రియ కేవలం 26 గంటల్లోనే పూర్తవగా.. ఇందుకోసం సుమారు కోటి రూపాయలు ఖర్చయింది. ఈ క్రమంలో దీన్ని సుదీర్ఘమైన ఎయిరోమెడికల్ లిఫ్టింగ్‌గా భావిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బెంగళూరుకు చెందిన 67ఏళ్ల మహిళ.. అమెరికాలోని ఓరెగాన్‌లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలోనే సదరు మహిళ.. కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లింది. అక్కడ తన కుటంబ సభ్యులతో గడుపుతూ.. అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో.. కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆమెను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించాని భావించారు. అనుకున్నట్టుగానే.. అందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే వృద్ధ మహిళను.. కేవలం 26 గంటల్లోనే పోర్ట్‌లాండ్‌ నుంచి టర్కీ మీదుగా చెన్నైకి తరలించారు. పోర్ట్‌లాండ్‌లో ఆదివారం ఉదయం ఈ తరలింపు ప్రక్రియ ప్రారంభం కాగా.. మంగళవారం తెల్లవారు జామున 2.10 గంటలకు ముగిసింది. చెన్నై ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే అంబులెన్స్ ద్వారా ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇందుకోసం 1,33,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.06కోట్లు) ఖర్చైంది.



ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ క్రిటికల్ కేర్ ఎయిర్ ట్రాన్ఫర్ టీమ్ (ICATT) డైరెక్టర్, సహవ్యవస్థాపకురాలు డాక్టర్ షాలినీ మాట్లాడారు. హెల్త్ ఇన్సురెన్సులో ఇబ్బందులు తలెత్తడం.. అమెరికాలో చికిత్సకు భారీ మొత్తంలో ఖర్చు అవుతుండటంతోనే కుటుంబ సదరు మహిళ కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అంతేకాకుండా ఆమెను ఆమెరికా నుంచి తరలించే క్రమంలో.. ముగ్గురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం మహిళ ఆరోగ్య పరిస్థిని పర్యవేక్షించినట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వృద్ధ మహిళకు శస్త్ర చికిత్స చేసినట్టు సమాచారం.


Updated Date - 2022-07-20T20:53:56+05:30 IST