బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని మొత్తం 28 శాసనసభా నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా ఎన్నికల సంఘం ప్రకటించింది. శాసనసభా నియోజకవర్గాలలోని ఓటర్ల రిజిస్ట్రేషన్ కార్యాలయం, సహాయ రిటర్నింగ్ అధికారి కార్యాలయం, వార్డు కార్యాలయాల్లోనూ గురువారం తుదిజాబితాను వెల్లడించారు. జనవరి 1 కి వర్తించేలా ఈ జాబితాను సిద్ధంచేసినట్లు ప్రకటించారు. 28 నియోజకవర్గాల్లో మొ త్తం 94,92,564 మంది ఓటర్లు ఉండగా ఇందులో 49,34,810 మంది పురుషులు, 45,56,097 మంది మహిళలు, 1657 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి