బెంగళూరులో నేడు భారీవర్షాలు...ఐఎండీ yellow warning జారీ

ABN , First Publish Date - 2021-11-19T12:58:52+05:30 IST

అల్పపీడన ప్రభావం వల్ల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో శుక్రవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో వెల్లడించింది...

బెంగళూరులో నేడు భారీవర్షాలు...ఐఎండీ yellow warning జారీ

బెంగళూరు(కర్ణాటక): అల్పపీడన ప్రభావం వల్ల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో శుక్రవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో వెల్లడించింది. బెంగళూరు నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి సదానంద చెప్పారు. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ కోరుతూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం  ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ తీరం, తమిళనాడు తీరంలోని ఉత్తర భాగం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది.బెంగళూరు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్‌ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 19.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని ఐఎండీ అధికారులు చెప్పారు. 


బెంగళూరులో ఇప్పటి వరకు 7.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఎయిర్‌పోర్ట్‌లో 8.2 మిమీ వర్షం నమోదైంది, యలహంకలో 4.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.శుక్రవారం నుంచి ఈ నెల 20వతేదీ వరకు వచ్చే మూడు రోజుల పాటు కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ అంతర్గత జిల్లాల్లో కూడా మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.  శుక్రవారం బళ్లారి, దావణగెరె, చిత్రదుర్గ, తుమకూరు, చిక్కబళ్లాపూర్, కోలార్, శివమొగ్గ, చిక్కమగళూరు, హాసన్, కొడగు సహా పశ్చిమ ఘాట్ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు.పశ్చిమ కనుమ జిల్లాలకు నవంబర్ 20 (శనివారం) కూడా ఎల్లో వార్నింగ్ జారీ చేసినట్లు ఐఎండీ అధికారులు వివరించారు.


Updated Date - 2021-11-19T12:58:52+05:30 IST