రెండేళ్ల తర్వాత Bengaluru కరగ ఉత్సవం

ABN , First Publish Date - 2022-02-11T17:29:53+05:30 IST

ప్రతిష్టాత్మకమైన బెంగళూరు కరగ ఉత్సవాన్ని ఈ ఏడాది ఆడంబరంగా నిర్వహించతలపెట్టారు. ఇందుకు ధర్మరాయస్వామి ఆలయ కమిటీతోపాటు నిర్వాహకులు సిద్ధమయ్యారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్ళపాటు కేవలం

రెండేళ్ల తర్వాత Bengaluru కరగ ఉత్సవం

   - మార్చి 8న నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభం

   - కరోనా ప్రభావం తగ్గడంతో ఈసారి ఆడంబరంగానే..


బెంగళూరు: ప్రతిష్టాత్మకమైన బెంగళూరు కరగ ఉత్సవాన్ని ఈ ఏడాది ఆడంబరంగా నిర్వహించతలపెట్టారు. ఇందుకు ధర్మరాయస్వామి ఆలయ కమిటీతోపాటు నిర్వాహకులు సిద్ధమయ్యారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్ళపాటు కేవలం ఆలయానికి మాత్రమే పరిమితం అయ్యేలా ఈ వేడుకలు సాగాయి. మార్చి 8న కరగ ఉత్సవం జరగనుంది. బెంగళూరు కరగ ఉత్సవానికి 800 ఏళ్ళ చరిత్ర ఉంది. బెంగళూరును నిర్మించిన కెంపేగౌడ కాలం నుంచి  కరగ ఉత్సవం కొనసాగేది. ఉత్సవాలను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన భక్తులు వస్తుంటారు. కరగ ఉత్సవం ఏటా ఉగాదికి ముందు వచ్చే పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. రాత్రి 11గంటలకు ధర్మరాయస్వామి ఆలయం నుంచి ఆరంభమయ్యే కరగ ఉత్సవం తెల్లారేదాకా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తుంది. సుమారు అర లక్షకు పైగా భక్తులు దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గినందున కరగ ఉత్సవాలు ఆడంబరంగా జరుపుకునే విధంగా అనుమతులు ఇవ్వాలని కరగ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ పీఆర్‌ రమేష్‌ బెంగళూరు పాలికె కమిషనర్‌కు వినతిని ఇచ్చారు. బీబీఎంపీ నుంచి సానుకూలమైన సందేశం రావడంతో ధర్మరాయస్వామి ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చుతున్నారు. గడిచిన ఏడేళ్ళుగా కరగను మోసే జ్ఞానేంద్ర ప్రస్తుతం కూడా మోయనున్నారు. 


Updated Date - 2022-02-11T17:29:53+05:30 IST