బీబీఎంపీ వార్డు రిజర్వేషన్లకు హైకోర్టు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-08-11T16:45:34+05:30 IST

బీబీఎంపీ(BBMP) వార్డుల రిజర్వేషన్‌ దురుద్దేశ పూరితంగాను, లోపభూయిష్టంగాను ఉందని పేర్కొంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యా

బీబీఎంపీ వార్డు రిజర్వేషన్లకు హైకోర్టు బ్రేక్‌

                                            - ఈ నెల 16న తదుపరి విచారణ


బెంగళూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): బీబీఎంపీ(BBMP) వార్డుల రిజర్వేషన్‌ దురుద్దేశ పూరితంగాను, లోపభూయిష్టంగాను ఉందని పేర్కొంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని హైకోర్టు(High Court) బుధవారం విచారణకు స్వీకరించింది. ఈనెల 16వరకు వార్డుల రిజర్వేషన్‌ జాబితాను పెండింగ్‌లో ఉంచాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. నగరానికి చెందిన న్యాయవాది ఇస్మాయిల్‌ జబీవుల్లా(Ismail Zabiullah) దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌ చందనగౌడర్‌ సారథ్యంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి, బీబీఎంపీ చీఫ్‌ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. చామరాజపేట శాసనసభ నియోజకవర్గ(Chamarajapet Legislative Assembly Constituency) పరిధిలోని వార్డుల రిజర్వేషన్ల కేటాయింపులో తారతమ్యం చోటు చేసుకుందని పిటీషనర్‌ పేర్కొన్నారు. ఈనెల 16వరకు రిజర్వేషన్‌ ప్రక్రియకు బ్రేక్‌ వేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. కాగా హైకోర్టు మధ్యంతర ఆదేశాలను పరిశీలిస్తున్నామని ఒకవేళ లోటుపాట్లు ఉంటే సవరిస్తామని ప్రభుత్వ వర్గాలు బుధవారం మీడియాకు తెలిపాయి. 

Updated Date - 2022-08-11T16:45:34+05:30 IST