Bengalure: ఫియాన్సీ న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన యంగ్ డాక్టర్...ఆమె ప్రతీకారం ఎలా తీర్చుకుందంటే..!

ABN , First Publish Date - 2022-09-21T01:11:29+05:30 IST

ప్రేమలో ప్రతీకారం ఉండవంటారు కానీ.. బెంగళూరుకు చెందిన ఓ యువ డాక్టర్ చేసిన ఓ పని... ఆమె ఫియాన్సీలో పగ రగిల్చింది. చివరకు కొందరు..

Bengalure: ఫియాన్సీ న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన యంగ్ డాక్టర్...ఆమె ప్రతీకారం ఎలా తీర్చుకుందంటే..!

బెంగళూరు: ప్రేమలో ప్రతీకారం ఉండవంటారు కానీ.. బెంగళూరుకు చెందిన ఓ యువ డాక్టర్ చేసిన ఓ పని... ఆమె ఫియాన్సీలో పగ రగిల్చింది. చివరకు కొందరు మిత్రులతో కలిసి ఆమె తన ప్రియుడిని అంతం చేసింది. ఒంటిపై గాయాల కారణంగా అతని మృతిని అసహజ మరణంగా భావించిన పోలీసులు ఆ కోణం నుంచి దర్యాప్తు మొదలుపెట్టారు. తీగలాగితే డొంకంతా కదిలింది. డాక్టర్‌ను అతని ఫియాన్సీనే కొందరు మిత్రులతో కలిసి తీవ్రంగా కొట్టి చంపిన విషయం వెలుగులోకి వచ్చింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాల్లోకి చూస్తే...


డాక్టర్ వికాస్ రంజన్ (27) ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకున్నారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ప్రాక్టీస్ మొదలుపెట్టి, ఆ తర్వాత కొత్త ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూనే, విదేశాల్లో వైద్యవిద్య చదవాలనే కోరిక ఉన్న వారికి శిక్షణ ఇచ్చేవాడు. కాగా, రెండేళ్ల క్రితం డాక్టర్ రంజన్‌కు ప్రతిభ అనే ఆర్చిటెక్ట్‌ సోషల్ మీడియోలో పరిచయమైంది. ఇద్దరు లివ్-ఇన్-రిలేషన్‌షిప్ (Live-in relationship) కొనసాగిస్తూ, కొద్దికాలం తర్వాత పెళ్లాడాలనుకున్నారు. అందుకు ఇరు కుటుంబాల పెద్దలు సైతం అంగీకారం తెలిపారు. ఈ క్రమంలోనే ఓ వారం రోజుల క్రితం తీవ్రగాయాలతో డాక్టర్ రంజన్ ఆసుపత్రి పాలయ్యారు. అప్పట్నించి కోమాలోనే ఉన్న అతను మూడు రోజుల తర్వాత మృతి చెందాడు. ఒంటిపై దెబ్బలు ఉండటంతో అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లోతుగా దర్యాప్తు సాగించడంతో అసలు విషయం బయట పడింది. ప్రతిభ తన మిత్రులతో కలిసి అతనిపై తీవ్రంగా దాడిచేసి ఆపస్మారక స్థితిలో పడిని అతన్ని ఆసుపత్రిలో చేర్చారనే విషయం వెలుగు చూసింది.


ఫోటోతో మొదలైన వివాదం...

సౌత్ ఈస్ట్ బెంగళూరు డీసీపీ సీకే బాబా కథనం ప్రకారం, ఈ మధ్యనే ఇన్‌స్టాగ్రామ్‌లో తన న్యూ్డ్ ఫోటో‌ ఉండటం ప్రతిభ గమనించింది. దీనిపై డాక్టర్ వికాస్‌తో గొడవపడింది. కేవలం వినోదం కోసమే ఫేక్ ఐడీ సృష్టించి ఫోటో పోస్ట్ చేశానని అతను వివరణ ఇచ్చాడు. ఆగ్రహంతో మండిపడిన ప్రతిభ ఎలాగైనా సరే అతనికి ఒక గుణపాఠం చెప్పాలనుకుంది. అదేరోజు (సెప్టెంబర్ 10) కొందరు మిత్రులతో కలిసి గెట్ టుగెదర్‌కు ఆమె ప్లాన్ చేసింది. తనతో పాటు డాక్టర్ రంజన్‌ను తీసుకు వెళ్లింది. మద్యం తీసుకున్న కాసేపటికి వారి మధ్య వివాదం మొదలైంది. అతి తారాస్థాయికి చేరుకోవడంతో ప్రతిభ, ఆమె మిత్రులు డాక్టర్‌‌ వికాస్‌పై ఫ్లోర్ తుడిచే కర్ర (ఫ్లోర్ మాప్)తో దాడి చేశారు. అతను తీవ్రంగా గాయపడటంతో ప్రతిభ వెంటనే ఆసుపత్రిలో చేర్చింది. అయితే తీవ్రమైన గాయాలతో కోమాలోకి వెళ్లిపోయిన వికాస్ మళ్లీ కోలుకోకుండానే కన్నుమూశాడు. డాక్టర్ రంజన్ సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ మరణంలో తన ప్రమేయం లేదని ప్రతిభ నమ్మబలుకుతున్నప్పటికీ పోలీసులు ఆమెతో పాటు ఆమె మిత్రులు గౌతమ్, సుశీల్, సునీల్‌ను అరెస్టు చేసి, హత్యా నేరంతో సహా వివిధ అభియోగాలపై కేసులు నమోదు చేశారు. నిందితులందరినీ జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.

Updated Date - 2022-09-21T01:11:29+05:30 IST