రాజధానిలో Covid కేసుల కలకలం

ABN , First Publish Date - 2022-01-19T18:09:08+05:30 IST

రాజధాని బెంగళూరులో గత రెండు రోజులుగా కాస్త తగ్గినట్టు అనిపించిన కొవిడ్‌ కేసులు మంగళవారం అమాంతం పెరగడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. తాజాగా బెంగళూరులో 25,595 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా కోలుకుని

రాజధానిలో Covid కేసుల కలకలం

బెంగళూరు: రాజధాని బెంగళూరులో గత రెండు రోజులుగా కాస్త తగ్గినట్టు అనిపించిన కొవిడ్‌ కేసులు మంగళవారం అమాంతం పెరగడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. తాజాగా బెంగళూరులో 25,595 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా కోలుకుని డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య మాత్రం 4,514గా ఉంది. రాష్ట్రంలో మొత్తం 20 మంది మృతి చెందగా బెంగళూరుకు చెందిన వారే ఏడుగురు ఉన్నారు. నగరంలో 1,78,328 యాక్టివ్‌కేసులు ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం 41,457 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు ఒక్కసారిగా 22.30 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 32.88 లక్షల కేసులు నమోదు కాగా 29.99 లక్షల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 38,465 మంది కొవిడ్‌కు బలయ్యారు. బెంగళూరు అనంతరం దక్షిణకన్నడ, బెంగళూరు గ్రామీణ, హాసన్‌, మైసూరు, తుమకూరులలో కేసులు వెయ్యి దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజధాని బెంగళూరులో తాజా కేసులతో కలిపి ఇంతవరకు 14.58 లక్షల మందికి కొవిడ్‌ వైరస్‌ సోకగా వీరిలో 12.63 లక్షల మంది కోలుకున్నారు. 16,465 మంది కొవిడ్‌కు బలయ్యారని బులెటిన్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-19T18:09:08+05:30 IST