Bengaluru నగర పోలీస్‌ కమిషనర్‌గా Pratapreddy

ABN , First Publish Date - 2022-05-17T16:29:40+05:30 IST

బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌గా 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సీహెచ్‌ ప్రతా్‌పరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ

Bengaluru నగర పోలీస్‌ కమిషనర్‌గా Pratapreddy

బెంగళూరు: బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌గా 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సీహెచ్‌ ప్రతా్‌పరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రతా్‌పరెడ్డి కర్ణాటకలోని హాసన్‌లో ఏఎస్పీగా తన సేవలను ప్రారంభించారు. 1994లో ముఖ్యమంత్రి పతకాన్ని అందుకున్నారు. రాష్ట్రంలోని కలబురగి, విజయపురతోపాటు ముంబైలోనూ ఆయన సేవలందించారు. బెంగళూరు సీబీఐ విభాగంలోనూ, అగ్నిమాపకశాఖలోనూ ఏడీజీపీగా సేవలందించి అపార అనుభవం గడించారు. సైబర్‌ సెక్యూరిటీ ఏడీజీపీగాను, లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీపీగాను ఆ యన గణనీయమైన సేవలందించారు. ప్రస్తుత నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ను పోలీసు రిక్రూట్‌మెంట్‌ విభాగం డీజీపీగా బదిలీ చేశారు. ఈ స్థానంలో లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీపీగా వ్యవహరిస్తున్న ప్రతాప్ రెడ్డిని నియమించారు. కేఎస్ఆర్‌పీ ఏడీజీపీ అలోక్‌కుమార్‌ను లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఏడీజీపీ ఆర్‌ హితేంద్రను పోలీస్‌ క్రైం టెక్నికల్‌ సర్వీసెస్‌ విభాగం నుంచి కేఎస్ ఆర్‌పీ ఏడీజీపీగా బదిలీ చేసింది. బెంగళూరు సెంట్రల్‌ విభాగం డీసీపీగా సేవలందిస్తున్న ఎంఎన్‌ అనుచేత్‌ను సీఐడీ ఎస్పీగా బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ సేవలందిస్తున్న టీ వెంకటేశ్‌ను బదిలీ చేసి రిజర్వులో ఉంచారు. 

Updated Date - 2022-05-17T16:29:40+05:30 IST