Bengal రంజీ ట్రోఫి జట్టులో ఏడుగురికి కరోనా

ABN , First Publish Date - 2022-01-03T17:58:06+05:30 IST

పశ్చిమ బెంగాల్ రంజీ ట్రోఫీ జట్టులోని ఏడుగురు సభ్యులు కరోనా బారిన పడ్డారు....

Bengal రంజీ ట్రోఫి జట్టులో ఏడుగురికి కరోనా

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రంజీ ట్రోఫీ జట్టులోని ఏడుగురు సభ్యులు కరోనా బారిన పడ్డారు.రంజీ ట్రోఫీ టోర్నమెంటు ప్రారంభానికి ముందు ఏడుగురు రంజీ జట్టు సభ్యులకు కొవిడ్ సోకడంతో జట్టు గందరగోళంలో పడింది. ప్రస్తుత కరోనా ఒమైక్రాన్ మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ భద్రతా చర్యగా బెంగాల్ క్రికెటర్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించిందని అసోసియేషన్ కార్యదర్శి స్నేహాశిష్ గంగూలీ తెలిపారు. గ్రూప్ బిలో విదర్భ, రాజస్థాన్, కేరళ, హర్యానా, త్రిపుర క్రికెట్ జట్లున్నాయి. బెంగాల్ జట్టు జనవరి 13వతేదీ నుంచి బెంగళూరులో త్రిపురపై తలపడనుంది. బెంగాల్ క్రికెట్ ఆటగాళ్లు సుదీప్ ఛటర్జీ, అనుస్తుప్ మజుందార్, కాజీ జునైద్ సైఫీ, గీత్ పూరి, ప్రదీప్త ప్రమాణిక్, సూరజిత్ యాదవ్, అసిస్టెంట్ కోచ్ సౌరాశిష్ లాహిరిలు కరోనా వైరస్ బారిన పడ్డారు.


ఆదివారం సాల్ట్ లేక్‌లోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ సెకండ్ క్యాంపస్ గ్రౌండ్‌లో జరిగిన ఇంట్రా-స్క్వాడ్ వార్మప్ గేమ్‌లో కరోనా సోకిన ఏడుగురు ఆటగాళ్లు పాల్గొన్నారు. కరోనా నిర్ధారణతో మంగళవారం నుంచి ముంబై జట్టుతో జరగాల్సిన రెండు రోజుల వార్మప్ గేమ్ ను రద్దు చేశారు. కొవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి మంగళవారం అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానుంది.కరోనా వ్యాప్తితో స్థానికంగా జరిగే అన్ని టోర్నమెంట్లను నిలిపివేయాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించిందని అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా, కార్యదర్శి స్నేహాశిష్‌ లు చెప్పారు.పశ్చిమ బెంగాల్‌లో ఒక వారంలో కోల్‌కతా నగరంలో రోజువారీ కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు 14 రెట్లు పెరిగాయి.


Updated Date - 2022-01-03T17:58:06+05:30 IST