మే 3న బెంగాల్‌ సీఎం బీజేపీ నేతనే: తేజస్వీ సూర్య

ABN , First Publish Date - 2021-03-05T02:45:06+05:30 IST

ఎనిమిది విడతల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 2న ఫలితాలు విడుదల అవుతాయి. అయితే బెంగాల్‌లో ఎనిమిది విడతల పోలింగ్‌పై

మే 3న బెంగాల్‌ సీఎం బీజేపీ నేతనే: తేజస్వీ సూర్య

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు కాబోయే ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ నుంచే అని భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధినేత, ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. మే 2న ఓట్ల లెక్కింపు అనంతరం మే 3న బీజేపీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 200 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘కమ్యూనిస్టులు సుధీర్ఘకాలం పాటు పాలించిన ప్రాంతం ఇది. ఆ తర్వాత మమతా బెనర్జీ పదేళ్లుగా పాలిస్తున్నారు. హత్యా రాజకీయాలు, గుండా రాజకీయాలు ఇక్క పరిపాటి అయ్యాయి. కానీ ఇకపై వాటికి తావు లేదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్‌కు మే 3న బీజేపీ ముఖ్యమంత్రి వస్తారు’’ అని తేజస్వీ సూర్య అన్నారు.


ఎనిమిది విడతల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 2న ఫలితాలు విడుదల అవుతాయి. అయితే బెంగాల్‌లో ఎనిమిది విడతల పోలింగ్‌పై మమతా బెనర్జీ సహా అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. బెంగాల్‌తో పాటే ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఒకే విడత పోలింగ్ పెట్టి బెంగాల్‌కు మాత్రం 8 విడతల్లో పోలింగ్ పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-03-05T02:45:06+05:30 IST