ED విచారణకు వెళ్తూ వెక్కివెక్కి ఏడ్చిన అర్పితా ముఖర్జీ

ABN , First Publish Date - 2022-07-30T01:58:57+05:30 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణంలో (teacher recruitment scam) మంత్రి పార్థా ఛటర్జీ (partha chatterjee) సహాయకురాలు అర్పితా ముఖర్జీ (arpitha mukherjee)ని వైద్య పరీక్షల కోసం జోకా ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకువచ్చిన సందర్భంగా వెక్కివెక్కి ఏడ్చారు.

ED విచారణకు వెళ్తూ వెక్కివెక్కి ఏడ్చిన అర్పితా ముఖర్జీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణంలో (teacher recruitment scam) మంత్రి పార్థా ఛటర్జీ (partha chatterjee) సహాయకురాలు అర్పితా ముఖర్జీ (arpitha mukherjee)ని వైద్య పరీక్షల కోసం జోకా ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకువచ్చిన సందర్భంగా వెక్కివెక్కి ఏడ్చారు. కారు నుంచి దిగబోనంటూ తొలుత మారాం చేశారు. చివరకు మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా కారు నుంచి దించారు. అయితే ఆమె అక్కడే నేలపై కూర్చుండిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసు సిబ్బంది ఆమెను వీల్‌చైర్ ద్వారా ఆసుపత్రికి లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె వెక్కివెక్కి ఏడ్చారు. ఆ తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. 


మరోవైపు ఇదే ఆసుపత్రికి వైద్యపరీక్షల నిమిత్తం వచ్చిన మంత్రి పార్థా ఛటర్జీ (partha chatterjee) తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. 


మరోవైపు పార్థా ఛటర్జీని మంత్రిపదవి నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee) నిన్ననే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఆయన్ను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తొలగించారు. 


అటు అర్పితా ముఖర్జీ ఫ్లాట్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దాడుల్లో ఇప్పటివరకూ 50 కోట్ల రూపాయలకు పైగా అక్రమ నగదు బయటపడింది. ఐదు కిలోల బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అర్పితా ముఖర్జీకి చెందిన   నాలుగు కార్లు అదృశ్యమయ్యాయి. ఆ కార్ల నిండా నోట్ల కట్టలున్నాయని సమాచారం. అధికారులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 





Updated Date - 2022-07-30T01:58:57+05:30 IST