కోల్‌కతా: రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రే చాన్స్‌లర్(Chancellor)గా ఉండేలా రూపొందించిన బిల్లు(bill)ను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ(West Bengal Assembl) సోమవారం ఆమోదించింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించగా ప్రభుత్వ ప్రతిపాదనకు అనుకూలంగా 182 ఓట్లు వచ్చాయి. కాగా, 40 మంది ఎమ్మెల్యేలు ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ముందు బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు మాట్లాడుతూ ‘‘కేంద్రం ఆధీనంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు ప్రధానమంత్రి చాన్స్‌లర్‌గా ఉన్నప్పుడు రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రి ఎందుకు చాన్స్‌లర్‌గా ఉండకూడదు? కావాలంటే మీరు పుంచి కమిషన్ ప్రతిపాదనలను పరిశీలించండి’’ అని అన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు చాన్స్‌లర్‌గా ఉన్న గవర్నర్ జగ్దీప్ ధన్కర్ చాలా సార్లు ప్రొటోకాల్ పాటించలేదని విమర్శించారు. కాగా, ఈ బిల్లు అమలులోకి వస్తే బెంగాల్‌లోని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడిచే విశ్విద్యాలయాకలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Chief Minister Mamata Banerjee) చాన్స్‌లర్‌గా కొనసాగుతారు.
ఇవి కూడా చదవండి