కాంగ్రెస్‌ను టీఎంసీలో విలీనం చేయండి.. బెంగాల్ మంత్రి సలహా

ABN , First Publish Date - 2022-03-11T00:41:04+05:30 IST

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం, కీలకమైన యూపీలో...

కాంగ్రెస్‌ను టీఎంసీలో విలీనం చేయండి.. బెంగాల్ మంత్రి సలహా

న్యూఢిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం, కీలకమైన యూపీలో కేవలం 2 స్థానాలకే పరిమితం కావడం, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లోనూ ఓటమిని చవిచూడటంపై పశ్చిమబెంగాల్ రవాణా శాఖ మంత్రి ఫిర్హద్ హకీం నిశిత విమర్శలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌లో (టీఎంసీ) కాంగ్రెస్ పార్టీని విలీనం చేయాలంటూ సలహా ఇచ్చారు.


''కాంగ్రెస్ లాంటి గ్రాండ్ ఓల్డ్ పార్టీ చిత్తుచిత్తుగా ఎందుకు ఓడిపోయిందో నాకు అర్ధం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీలో టీఎంసీలో వీలీనం చేస్తే సరిపోతుంది. అందుకు ఇదే సరైన సమయం. అప్పుడే గాంధీ సిద్ధాంతాలు, సుభాస్ చంద్రబోస్ సిద్ధాంతాలను కలగలిపి గాడ్సే సిద్ధాంతాలపై మనం పోరాడవచ్చు'' అని ఫిర్వద్ హకీం వ్యాఖ్యానించారు. కాగా, టీఎంసీ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించ లేదు.

Updated Date - 2022-03-11T00:41:04+05:30 IST