సరదా కోసం గాలి నింపారు... గాలిబుడగై పేలిపోయాడు...

ABN , First Publish Date - 2021-11-27T00:26:23+05:30 IST

సరదా కోసం గాలి నింపారు... గాలిబుడగై పేలిపోయాడు...

సరదా కోసం గాలి నింపారు... గాలిబుడగై పేలిపోయాడు...

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సరదా కోసం చేసిన పని తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 'సరదా' కోసం సహోద్యోగులు గాలిని అతనిలోకి పంపడంతో బెంగాల్ వ్యక్తి మరణించాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఒక మిల్లులోని కార్మికులు కేవలం 'సరదా' కోసం సహోద్యోగి రెహ్మత్ అలీ శరీరంలోకి అతని మలద్వారం ద్వారా గాలిని పంప్ చేశారు. సుమారు 10 రోజుల చికిత్స అనంతరం రెహ్మత్ ఇటీవల ఆసుపత్రిలో సమస్యలతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉన్న నార్త్ బ్రూక్ జూట్ మిల్లులో నవంబర్ 16న ఈ ఘటన జరిగింది. రెహ్మత్ అలీ రాత్రి షిఫ్ట్‌లో ఉండగా అతని సహోద్యోగులు అతనిని పట్టుకుని అతని మలద్వారంలోకి పైపుని తొడిగి శరీరంలోకి గాలిని పంప్ చేశారని కుంటుబ సభ్యులు ఆరోపించారు.


బాధితుడు ఆ సమయంలో ప్రతిఘటించినప్పటికీ సహాద్యోగులు ఆగకుండా గాలిని పంపు చేశారు. దీంతో అనారోగ్యంతో బాధితుడు రెహ్మత్  చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. గాలి ఒత్తిడి వల్ల బాధితుడు రెహ్మత్ అలీ కాలేయం పూర్తిగా చేడిపోయినట్లు డాక్టర్ పేర్కొన్నారు. ఈ  ఘటన అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులు భద్రేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మృతుడు రెహ్మత్ అలీ సహోద్యోగి షాజాదా ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. షాజాదా ఖాన్ జుట్ మిల్లులో ఎయిర్ పంపు ద్వారా క్లినింగ్ చేస్తుండేవాడు. మృతుడు రెహ్మత్ అలీ కుటుంబ సభ్యులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జుట్ మిల్లు యాజమాన్యం స్పందించకుండా ఉండిపోయింది.

Updated Date - 2021-11-27T00:26:23+05:30 IST