బెంగాల్‌ ఎన్నికలు యథాతథం: ఈసీ

ABN , First Publish Date - 2021-04-16T07:10:39+05:30 IST

దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్న దృష్ట్యా పశ్చిమ బెంగాల్‌లోని చివరి 4

బెంగాల్‌ ఎన్నికలు యథాతథం: ఈసీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్న దృష్ట్యా పశ్చిమ బెంగాల్‌లోని చివరి 4 దశల ఎన్నికలను కలిపేసి ఒకే విడతలో నిర్వహిస్తారంటూ వస్తున్న ఊహాగానాలను ఈసీ తోసిపుచ్చింది. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) శుక్రవారం కోల్‌కతాలో అఖిపక్ష సమావేశాన్ని నిర్వహించి కొవిడ్‌ మార్గదర్శకాల అమలు గురించి చర్చిస్తారని ఈసీ అధికారులు గురువారం చెప్పారు. ప్రచారంలో నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని ఈసీ పేర్కొన్నది.


Updated Date - 2021-04-16T07:10:39+05:30 IST